స్పెషల్ రికార్డుకు చేరువలో జేమ్స్ అండర్సన్
ఈ వార్తాకథనం ఏంటి
మాంచెస్టర్ వేదికగా జులై 19 నుంచి ప్రారంభం కానున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టు కోసం ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తుది జట్టును నేడు ప్రకటించింది.
నాలుగో టెస్టులో ఓలీ రాబిన్సన్ స్థానంలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ తుది జట్టులోకి వచ్చాడు.
స్వదేశంలో యాషెస్ సిరీస్‌లో భాగంగా 50 వికెట్ల మార్కును దాటడానికి జేమ్స్ అండర్సన్ కేవలం మూడు వికెట్ల దూరంలో ఉన్నాడు. 40 ఏళ్ల నిండిన కూడా అండర్సన్ ఇంగ్లండ్ తరుపున అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వికెట్లను పడగొడుతున్నాడు.
ఇప్పటివరకూ 16 యాషెస్ టెస్టుల్లో 36.06 సగటుతో 47 వికెట్లను అండర్సన్ పడగొట్టాడు.
Details
టెస్టుల్లో అండర్సన్ సాధించిన రికార్డులివే
ఇంకా మూడు వికెట్లను తీస్తే సొంతగడ్డపై యాషెస్‌లో 50 వికెట్లు పూర్తి చేసిన 11వ ఇంగ్లండ్ బౌలర్‌గా అండర్సన్ చరిత్రకెక్కనున్నాడు.
అండర్సన్ ఈ ఏడాది నాలుగు టెస్టు మ్యాచులను ఆడాడు. ఇందులో 30.30 సగటుతో 13 వికెట్లను తీశాడు.
మాంచెస్టర్‌లో మైదానంలో 10 టెస్టులు ఆడిన అండర్సన్ 22.02 సగటుతో 37 వికెట్లు పడగొట్టాడు.
ఇంగ్లండ్ తరుపున టెస్టుల్లో 181 మ్యాచులు ఆడి 26.21 సగటుతో 688 వికెట్లు పడగొట్టాడు. దీంతో టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్ గా నిలిచాడు. ముత్తయ్య మురళీధరన్ (800), షేన్ వార్న్ (708) తర్వాతి స్థానంలో అతను నిలిచాడు.
ఇక ఈ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా 2-1 ఆధిక్యంలో ఉంది.