Joe Root : సచిన్ అల్ టైం రికార్డుకు చేరువలో జో రూట్
ప్రపంచ క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్ అనే పేరు ఒక శిఖరం. టెస్టులు, వన్డేల్లో సచిన్ ఎన్నో రికార్డులు నెలకొల్పాడు. కానీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ ఈ అసాధ్యాన్ని సాద్యం చేస్తూ, సచిన్ రికార్డులను బద్దలు కొట్టే దిశగా పరుగులు తీస్తున్నారు. రెగ్యులర్‌గా సెంచరీలు సాధిస్తూ క్రికెట్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాడు. రూట్ లార్డ్స్ టెస్టులో 103 పరుగులతో ఇంగ్లాండ్ తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 2021కి ముందు కేవలం 17 సెంచరీలతో ఉన్న రూట్, ఇప్పుడు తన 34వ సెంచరీని సాధించి సత్తా చాటాడు.
ద్రావిడ్ రికార్డును బద్దలు కొట్టే దిశగా జో రూట్
రూట్ ఈ మూడు సంవత్సరాల్లోనే 17 సెంచరీలు సాధించాడు. అదే సమయంలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, విరాట్ కోహ్లీలు 10 సెంచరీలు కూడా సాధించలేకపోయారు. వీరిలో విలియమ్సన్ 9, స్మిత్ 6, కోహ్లీ 2 సెంచరీలతో మాత్రమే పరిమితం అయ్యారు. రూట్ ఆటతీరును చూస్తే, సచిన్ రికార్డుకు చేరవయ్యే అవకాశం ఉందని క్రికెట్ మేధావులు చెబుతున్నారు. టెస్టులో అత్యధిక క్యాచులు తీసుకున్న ఫీల్డర్‌లో రాహుల్ ద్రావిడ్(210) అగ్రస్థానంలో ఉన్నాడు. తాజాగా శ్రీలంకతో రెండో టెస్టులో రూట్ 200 క్యాచులు పూర్తి చేసుకున్నారు. దీంతో త్వరలో ఆయన ద్రావిడ్ రికార్డును అధిగమించే అవకాశం ఉంది.