Kabaddi: ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తున్న కబడ్డీ.. కోట్ల వర్షం కురిపిస్తున్న ఫ్రాంచైజీలు
కబడ్డీ లీగ్ దేశంలో సంచనాలను సృష్టిస్తోంది. ఒక గ్రామీణ క్రీడగా ఉన్న కబడ్డీ ప్రస్తుతం ప్రపంచ మార్కెట్‌ను శాసిస్తోంది. ఫ్రాంచైజీలు కూడా ఆ ఆట కోసం డబ్బుల వర్షం కురిపిస్తున్నారు. ఒక్కో ఆటగాడిని కోట్లు పెట్టి కొనుగోలు చేసి, కబడ్డీ బ్రాండ్ వాల్వూను పెంచుతున్నారు. రూరల్ ఇండియాలోనే కాకుండా ఆర్బన్ స్పోర్ట్స్ లవర్స్‌ను కూడా ఆకట్టుకుంటోంది. ఐపీఎల్ తర్వాత అత్యధిక మంది చూసే లీగ్‌గా పీకేఎల్ రికార్డుకెక్కింది.
బ్రాండ్ వాల్వూ పెంచుకుంటూ పోతున్న కబడ్డీ
ఇప్పటివరకూ 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకొని 11వ సీజన్ లోకి అడుగుపెడుతోంది. ప్రతి సీజన్‌కూ తన బ్రాండ్ వాల్వూ పెంచుకుంటూ ముందుకెళ్తోంది. 2014లో తొలిసారి ప్రొ కబడ్డీ లీగ్ ప్లేయర్ల వేలం జరిగింది. అప్పట్లో ఇండియన్ కబడ్డీ టీమ్ కెప్టెన్ రాకేశ్ కుమార్ అత్యధిక ధర పలికిన విషయం తెలిసిందే. గ్రామీణ స్థాయి నుంచి ప్రపంచ మార్కెట్ ను శాసించే వరకు కబడ్డీ ఎలా ఎదిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
కబడ్డీ లీగ్ తో కోటీశ్వరులు అయిన ప్లేయర్లు
ఇండియా వీధుల్లో పుట్టిన కబడ్డీ ఆట ఇవాళ ప్రపంచం మొత్తం మీద తనదైన ముద్ర వేసుకుంది. ప్రో కబడ్డీ లీగ్ పేరుతో భారీ బిజినెస్ జరిగింది. అప్పట్లో కొత్త ఫ్రాంచైజీని ఎంచుకోవడానికి సగటు ధర రూ. 100 కోట్లు దాటడం గమనార్హం. కబడ్డీ లీగ్ వల్ల ఎంతోమంది రాత్రికి రాత్రే కోటీశ్వరులు అయ్యారు. 2014లో వేలం జరిగినప్పుడు ప్లేయర్స్ పర్స్ కేవలం రూ.20 లక్షలు మాత్రమే. ఇక 2023లో ప్లేయర్ పర్స్ రూ.2.65 కోట్లకు చేరింది.
అత్యధిక వ్యూస్ సాధించిన రెండోవ క్రీడగా రికార్డు
ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత భారతీయ టెలివిజన్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన రెండోవ క్రీడా టోర్నమెంట్‌గా చరిత్రకెక్కింది. 8 ఫ్రాంచైజీలతో ప్రారంభమైన ఈ కబడ్డీ లీగ్.. 2017 ఎడిషన్‌లో లక్నో, సోనిపట్, పాట్నా వంటి కబడ్డీ సంప్రదాయ ఫ్రెండ్లీ సిటీస్ సహా 12 జట్లు ఏర్పడ్డాయి. మొదటి నాలుగు సీజన్లలో లీగ్ వీక్షకుల సంఖ్య 50శాతం కంటే ఎక్కువ పెరిగిందని స్టార్ ఇండియా పేర్కొంది. అభిమానుల కోసం లీగ్‌ను మరాఠీ, తెలుగు, కన్నడ భాషల్లో కూడా ప్రసారం చేశారు.
2017 లీగ్ టైటిల్ స్పాన్సర్ ను రూ. 300 కోట్లకు కొనుగోలు చేసిన వీవో
Vivo దాదాపు రూ.300 కోట్లకు తొలిసారిగా 2017 లీగ్ టైటిల్ స్పాన్సర్‌ను కైవసం చేసుకుంది. 2014లో ప్రో కబడ్డీ లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ క్రీడకు భారీ ప్రజాదరణ లభించింది. భారత కబడ్డీ సమాఖ్య 1950 సంవత్సరంలో స్థాపించారు. కబడ్డీ మొదటిసారిగా చైనాలో జరిగిన 1990 ఆసియా క్రీడలలో ప్రవేశపెట్టారు. అప్పటి నుండి 2006 వరకు మనదేశం కబడ్డీ క్రీడాకారులు ఈ ఆటలో ప్రపంచ విజేతలుగా నిలిచారు. రాహుల్ చౌదరి, అనూప్ కుమార్, ప్రదీప్ నర్వాల్, అజయ్ తకుర్, జాస్విర్ సింగ్, సందీప్ నర్వాల్, దీపక్ నివ్స్, హూడా, మన్జీత్ చిల్లర్, మోహిత్ చిల్లర్ వంటి వారు దేశవ్యాప్తంగా కబడ్డీ ఆటతో అభిమానులను సంపాదించుకున్నారు.