
KL Rahul : కేఎల్ రాహుల్ అరుదైన ఘనత.. 1000 పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు
ఈ వార్తాకథనం ఏంటి
టీమ్ఇండియా ఆటగాడు కేఎల్ రాహుల్ అరుదైన ఘనతను సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై ఆ దేశమే అయిన ఇంగ్లాండ్ జట్టుతో టెస్టుల్లో 1000పరుగులు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో ఆయన స్థానం సంపాదించాడు. ప్రస్తుతం మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్‌లో రాహుల్ తన వ్యక్తిగత స్కోరు 11 పరుగులకు చేరుకున్న సమయంలో ఈ ఘనతను అందుకున్నాడు. ఇంతకుముందు ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో 1000పరుగుల మార్కును దాటి రికార్డు బుక్‌లోకి ఎక్కిన భారత క్రికెటర్లలో సచిన్ టెండూల్కర్,రాహుల్ ద్రవిడ్,సునీల్ గవాస్కర్ మాత్రమే ఉన్నారు. తాజాగా కేఎల్ రాహుల్ కూడా ఈజాబితాలో చేరి నాలుగో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఈక్రమంలో ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలోనూ రాహుల్ నాలుగో స్థానాన్ని పొందాడు.
వివరాలు
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్ పై అత్యధిక టెస్టు పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
ఇంగ్లాండ్‌లో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడు సచిన్ టెండూల్కర్. ఆయన మొత్తం 17 టెస్టు మ్యాచ్‌ల్లో 1575 పరుగులు చేశాడు. ఆయన తర్వాత రాహుల్ ద్రవిడ్, సునీల్ గవాస్కర్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ వరుసగా ఉన్నారు. సచిన్ టెండూల్కర్ - 17 మ్యాచ్‌ల్లో 1575 పరుగులు రాహుల్ ద్రవిడ్ - 13 మ్యాచ్‌ల్లో 1376 పరుగులు సునీల్ గవాస్కర్ - 16 మ్యాచ్‌ల్లో 1152 పరుగులు కేఎల్ రాహుల్ - 13 మ్యాచ్‌ల్లో 1035 పరుగులు విరాట్ కోహ్లీ - 15 మ్యాచ్‌ల్లో 976 పరుగులు
వివరాలు
4 వికెట్ల నష్టానికి 264 పరుగులు
ఇక నాలుగో టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే, తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 4 వికెట్ల నష్టానికి 264 పరుగులు చేసింది. ప్రస్తుతం రవీంద్ర జడేజా (19), శార్దూల్ ఠాకూర్ (19) క్రీజులో ఉన్నారు. మిగతా బ్యాటర్లు యశస్వి జైస్వాల్ (58), సాయి సుదర్శన్ (61) అర్ధశతకాలు నమోదు చేశారు. కేఎల్ రాహుల్ 46 పరుగులతో మెరిశాడు. అయితే కెప్టెన్ శుభమన్ గిల్ కేవలం 12 పరుగులతో నిరాశ పరిచాడు.