ICC Rankings: నంబర్ వన్ ఆల్‌రౌండర్‌గా లియామ్ లివింగ్‌స్టోన్
ఐసీసీ బుధవారం తాజాగా ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. ఇక టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఆల్-రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్ తన అద్భుత ప్రదర్శనతో నంబర్ వన్ ఆల్-రౌండర్‌గా నిలిచాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో లివింగ్‌స్టోన్ బ్యాటింగ్, బౌలింగ్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చాడు. రెండు మ్యాచ్‌ల్లో లియామ్ 124 పరుగులు సాధించి, ఐదు వికెట్లు తీశాడు. ఒక మ్యాచ్‌లో లియామ్ 47 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్లతో 87 పరుగులు చేసి ఇంగ్లండ్‌కు 194 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఏడో స్థానంలో హార్ధిక్ పాండ్యా
ఈ అద్భుత ప్రదర్శనతో లివింగ్ స్టోన్ ర్యాంకింగ్స్‌లో ఏడు స్థానాలు ఎగబాకి నంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇక మాజీ నంబర్ వన్ మార్కస్ స్టోయినిస్ రెండు స్థానాలు కోల్పోయాడు. భారత ఆల్-రౌండర్లలో, హార్దిక్ పాండ్యా టాప్-10లో మాత్రమే ఉన్నాడు. హార్దిక్ 199 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతున్నాడు, ఇక అక్షర్ పటేల్ 149 పాయింట్లతో 11వ స్థానంలో ఉన్నాడు. బ్యాట్స్‌మెన్ ర్యాంకింగ్స్‌లో భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.