Champions Trophy: ఇంగ్లాండ్‌కు లక్కీ బ్రేక్ - ఆఫ్గానిస్థాన్‌కు సెమీస్ ఆశలు సజీవం!
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీ ఉత్కంఠభరితంగా సాగుతోంది. గ్రూప్-బి నుంచి సెమీఫైనల్‌కు చేరే జట్లపై ఇంకా స్పష్టత రాలేదు.
అయితే గ్రూప్-ఏ నుంచి భారత్, న్యూజిలాండ్ జట్లు ఇప్పటికే సెమీఫైనల్‌కు ప్రవేశించాయి. మంగళవారం జరగాల్సిన ఆస్ట్రేలియా-దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.
ఈ అనూహ్య పరిణామంతో ఇంగ్లాండ్ జట్టుకు లక్కీ బ్రేక్ వచ్చినట్లయింది. అలాగే ఆఫ్గానిస్థాన్ జట్టుకు కూడా సెమీస్‌కు చేరుకునే అవకాశాలు మెరుగయ్యాయి.
Details
రసవత్తరంగా సెమీఫైనల్ సమీకరణాలు
వర్షం వల్ల మ్యాచ్ రద్దు కావడంతో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లకు చెరో పాయింట్ లభించింది.
ప్రస్తుతం మూడు పాయింట్లతో ఈ రెండు జట్లు పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
అయితే దక్షిణాఫ్రికా జట్టు మెరుగైన నెట్ రన్ రేట్‌తో ప్రథమ స్థానంలో నిలిచింది.
ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్ జట్లు ఇప్పటివరకు ఒక్కో మ్యాచ్ ఆడినా విజయం సాధించలేదు. కానీ ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మ్యాచ్ డ్రా కావడంతో ఈ రెండు జట్లకు సెమీస్ చేరేందుకు మార్గం ఏర్పడింది.
Details
ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్ మధ్య కీలక మ్యాచ్
ఇవాళ ఇంగ్లండ్-ఆఫ్గానిస్థాన్ మధ్య జరగనున్న మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌కు చేరే అవకాశాలను మెరుగుపర్చుకుంటుంది.
ఇంగ్లాండ్ గెలిస్తే మార్చి 1న దక్షిణాఫ్రికాపై కూడా విజయం సాధిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్‌కు ప్రవేశించనుంది.
ఆఫ్గానిస్థాన్, ఇంగ్లండ్‌పై గెలిచి, శుక్రవారం జరిగే ఆస్ట్రేలియాపై కూడా విజయం సాధిస్తే నాలుగు పాయింట్లతో సెమీస్‌కు చేరుతుంది.
Details
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా - చివరి అవకాశాలు!
ఆస్ట్రేలియా ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లలో మూడు పాయింట్లు సాధించింది. చివరి మ్యాచ్ శుక్రవారం ఆఫ్గానిస్థాన్‌తో జరగనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ఐదు పాయింట్లతో సెమీస్‌లోకి అడుగుపెడుతుంది.
దక్షిణాఫ్రికా తన చివరి మ్యాచ్ ఇంగ్లాండ్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఐదు పాయింట్లతో సెమీస్‌కు చేరుతుంది.
నెట్ రన్ రేట్ కీలకం
ఒకవేళ ఆసీస్, సౌతాఫ్రికా రెండూ ఐదు పాయింట్లు సాధిస్తే, గ్రూప్-బి టాప్ జట్టును నెట్ రన్ రేట్ ఆధారంగా నిర్ణయిస్తారు.
Details
సెమీస్‌కు చేరేది ఎవరు?
గ్రూప్-బిలో ఇప్పటివరకు ఏ జట్టూ ఖచ్చితంగా సెమీస్‌కు చేరలేదు.
ఇంగ్లాండ్, ఆఫ్గానిస్థాన్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నాలుగు జట్లకు అవకాశాలున్నాయి. బుధవారం, శుక్రవారం జరగనున్న మ్యాచులు సెమీఫైనల్ సమీకరణాలను తేల్చనున్నాయి.
ఈ కీలక మ్యాచుల్లో ఎవరు విజయం సాధిస్తారో వేచి చూడాలి!