Page Loader
Virat Kohli: మాక్స్ వెల్ ఒక్కడే ఇలా చేయగలడు.. ప్రశంసలతో ముంచెత్తిన విరాట్ కోహ్లీ
మాక్స్ వెల్ ఒక్కడే ఇలా చేయగలడు.. ప్రశంసలతో ముంచెత్తిన విరాట్ కోహ్లీ

Virat Kohli: మాక్స్ వెల్ ఒక్కడే ఇలా చేయగలడు.. ప్రశంసలతో ముంచెత్తిన విరాట్ కోహ్లీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 08, 2023
03:56 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్‌ 2023లో భాగంగా ఆప్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచులో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్‌వెల్ డబుల్ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. 128 బంతుల్లో 210 పరుగులు చేసి ఛేజింగ్‌లో మాక్స్ వెల్ రికార్డు సృష్టించాడు. ఈ నేపథ్యంలో మాక్స్ వెల్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. తాజాగా టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తన దైన స్టయిల్ లో మాక్స్ వెల్‌ని అభినందించారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల వ్యక్తి మాక్స్ వెల్ ఒక్కడే ని కోహ్లీ తన ఇన్‌స్టాలో కామెంట్ చేశారు. ఈ అద్భుతాన్ని మాక్సీ ఒక్కడే చేయగలడని కోహ్లీ తన పోస్టులో చెప్పుకొచ్చాడు.

Details

థ్యాంక్ చెప్పిన మాక్స్ వెల్

ఇక ఐపీఎల్‌లో మాక్స్ వెల్, విరాట్ కోహ్లీ ఒకే జట్టుకు ఆడిన విషయం తెలిసిందే. కోహ్లీ చేసిన పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. తనపై వస్తున్న ప్రశంసలపై మాక్స్ వల్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో స్పందించాడు. మెసేజ్‌లు పంపిన వారందరికీ థ్యాంక్స్ చెప్పాడు. ఆఫ్ఘన్ పై విజయంలో ఆస్ట్రేలియా జట్టు సెమీస్ కు చేరుకుంది.