IPL Cricketer: మోడల్ తానియా ఆత్మహత్య.. SRH స్టార్ ప్లేయర్ కి పోలీసుల సమన్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) పదిహేడవ సీజన్‌కు ముందు, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ వివాదంలో చిక్కుకున్నాడు. సూరత్‌కు చెందిన మోడల్ తానియా సింగ్ ఆత్మహత్య కేసులో సన్‌రైజర్స్ సన్ రైజర్స్ స్టార్ ఆల్ రౌండర్, పంజాబ్ దేశవాళీ క్రికెటర్, అభిషేక్ శర్మకు సూరత్ పోలీసులు సమన్లు పంపారు. అహ్మదాబాద్ మిర్రర్ ప్రకారం, రాజస్థాన్‌కుచెందిన . ఆమె వెసు ప్రాంతంలోని హ్యాపీ ఎలిగాన్స్‌లో నివసిస్తోంది. మృతురాలు ఫ్యాషన్ డిజైనింగ్ చదువుతోంది. తానియా ఆత్మహత్య వెనుక ప్రేమ వ్యవహారాన్ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమె ఆత్మహత్య చేసుకునేముందు చివరిగా డయల్ చేసిన జాబితాలో అభిషేక్ పేరు ఉండడంతో అతనిని విచారణకు పిలిచారు. మృతురాలు,అభిషేక్‌కు మధ్య చాలా కాలంగా అసలు పరిచయం లేదని ప్రాథమిక వివరాలు సూచిస్తున్నాయి.
అభిషేక్ శర్మ IPL కెరీర్
అయితే, అతను చాలా కాలంగా ఆమెకు స్నేహితుడు కావడంతో, అతన్ని విచారణకు పిలిచారు. ఇక, అభిషేక్ శర్మ IPL కెరీర్ విషయానికి వస్తే, ఈ ఆల్ రౌండర్ T20 లీగ్‌లో 47 మ్యాచ్‌లలో 137.38 స్ట్రైక్ రేట్‌తో 893 పరుగులు చేశాడు. దీంతోపాటు టోర్నీలో 9 వికెట్లు పడగొట్టాడు.ఐపీఎల్‌తో పాటు దేశవాళీ క్రికెట్‌లో పంజాబ్ తరఫున అభిషేక్ ఆడుతున్నాడు. రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో తమిళనాడుపై శర్మ ఇటీవల ఒక ఓవర్‌లో ఐదు సిక్సర్లు కొట్టి, ఈ ఘనత సాధించిన నాల్గవ భారతీయుడు అయ్యాడు.