
SRH vs MI : సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 4 వికెట్ల తేడాతో గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
వాంఖడే స్టేడియంలో జరిగిన ఆసక్తికరమైన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది.
సన్ రైజర్స్ హైదరాబాద్‌పై నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించిన ముంబై, కీలక సమరంలో మేటి ప్రదర్శన కనబరిచింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది.
అభిషేక్ శర్మ 40 పరుగులు చేయగా,ట్రావిస్ హెడ్ 28,నితీష్ కుమార్ రెడ్డి 19, హెన్రిచ్ క్లాసెన్ 37, అనికేత్ వర్మ 18 పరుగులు చేసి జట్టు స్కోరుకు తోడ్పడ్డారు.
ముంబై బౌలింగ్ విభాగంలో విల్ జాక్స్ రెండు కీలక వికెట్లు పడగొట్టగా,ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బూమ్రా, హార్దిక్ పాండ్యా ఒక్కొక్కరు ఒక్క వికెట్ చొప్పున తీశారు.
వివరాలు
ఆరంభం నుండే మంచి ప్రదర్శన
అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ముంబై జట్టు, ఆరంభం నుండే మంచి ప్రదర్శన కనబరిచింది.
ఓపెనర్ రోహిత్ శర్మ 26 పరుగులు చేశాడు, అతనికి తోడు రికెల్టన్ 31 పరుగులతో సత్తా చాటాడు.
అనంతరం వచ్చిన విల్ జాక్స్ 36 పరుగులు చేస్తే, సూర్యకుమార్ యాదవ్ 26 పరుగులు చేశాడు.
తిలక్ వర్మ 16, హార్దిక్ పాండ్యా 21 పరుగులతో జట్టును విజయతీరాలకు చేర్చారు.
మొత్తంగా ముంబై జట్టు 18.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి విజయం సాధించింది.
హైదరాబాద్ బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమ్మిన్స్ మూడు వికెట్లు తీసి మెరుగైన ప్రదర్శన చేయగా, హర్షల్ పటేల్ ఒక వికెట్ సాధించాడు.