
MI vs CSK : తొమ్మిది వికెట్ల తేడాతో ముంబయి ఇండియన్స్ గెలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్-18లో ముంబయి ఇండియన్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. చైన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. లక్ష్య చేధనలో ముంబయి ఇండియన్స్ 15.4 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది.
ముంబయి విజయంలో రోహిత్ శర్మ (76 నాటౌట్), సూర్యకుమార్ యాదవ్ (68 నాటౌట్) కీలక పాత్ర పోషించారు. వీరిద్దరూ హాఫ్ సెంచరీలు చేసి చైన్నై బౌలర్లపై విరుచుకుపడ్డారు.
ఈ సీజన్‌లో ముంబైకి నాలుగో విజయం కాగా, చెన్నైకి ఇది ఆరో ఓటమి కావడం గమనార్హం.
Details
అరంగేట్ర మ్యాచులో ఆకట్టుకున్న ఆయూష్ మాత్రే
చెన్నై ఇన్నింగ్స్‌లో ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
నాలుగో ఓవర్ తొలి బంతికే రచిన్ రవీంద్ర (5) కీపర్ రికెల్‌టన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అతడిని అశ్వనీ కుమార్ ఔట్ చేశాడు.
గాయం కారణంగా రుతురాజ్ గైక్వాడ్ మ్యాచ్‌కు దూరమవడంతో, 17 ఏళ్ల ఆయూష్ మాత్రే బరిలోకి వచ్చాడు. అతడు 15 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.
కానీ ఏడో ఓవర్ చివరి బంతికి చాహర్ బౌలింగ్‌లో శాంట్నర్‌కు చిక్కాడు.
అనంతరం షేక్ రషీద్ (19)కూడా శాంట్నర్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. రవీంద్ర జడేజా (53 నాటౌట్), శివమ్ దూబే (50) అర్ధ సెంచరీలు నమోదు చేశారు.
వీరిద్దరూ కలిసి మిడిల్ ఆర్డర్‌లో ఇన్నింగ్స్‌ను చక్కగా నిర్మించారు.
Details
శివం దూబే, జడేజా హాఫ్ సెంచరీ
దూబే 30 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, 16వ ఓవర్లో అశ్వనీ కుమార్ బౌలింగ్‌లో 24 పరుగులు వచ్చాయి. ఆ ఓవర్‌లో దూబే రెండు సిక్స్‌లు, జడేజా ఒక ఫోర్, ఒక సిక్స్ కొట్టారు.
అయితే, 16.2వ ఓవర్‌లో బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్ ఆడిన దూబే విల్ జాక్స్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తర్వాత బుమ్రా కెప్టెన్ ధోనీని కూడా పెవిలియన్‌కి పంపించాడు. చివరి ఓవర్‌లో జడేజా అర్ధ సెంచరీ పూర్తి చేశాడు.
ముంబయి బౌలింగ్ విభాగంలో బుమ్రా రెండు వికెట్లు తీయగా, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, శాంట్నర్ చెరో వికెట్ తీసుకున్నారు.
మొత్తంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమతుల్య ప్రదర్శనతో ముంబయి ఇండియన్స్ గెలుపొందింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
FIFTY NO. 1⃣ in #TATAIPL 2025 💙
— IndianPremierLeague (@IPL) April 20, 2025
Rohit Sharma is back doing what he does the best 🫡
Updates ▶ https://t.co/v2k7Y5sIdi#MIvCSK | @ImRo45 pic.twitter.com/DQLNlD1T6b