Loading...
IPL Auction: ముస్తాఫిజుర్‌ మళ్లీ వస్తున్నాడు...ఐపీఎల్‌ వేలంలో ఏడుగురు బంగ్లా ఆటగాళ్లు
ముస్తాఫిజుర్‌ మళ్లీ వస్తున్నాడు...ఐపీఎల్‌ వేలంలో ఏడుగురు బంగ్లా ఆటగాళ్లు

IPL Auction: ముస్తాఫిజుర్‌ మళ్లీ వస్తున్నాడు...ఐపీఎల్‌ వేలంలో ఏడుగురు బంగ్లా ఆటగాళ్లు

వ్రాసిన వారు Balachander Sharma
Nov 12, 2026
09:15 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్‌లో గతసారి అనూహ్య పరిణామంతో జట్టుకు దూరమైన బంగ్లాదేశ్ స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఐపీఎల్ 2027 వేలం కోసం అతడితో పాటు మొత్తం ఏడుగురు బంగ్లాదేశ్ క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకోవడం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు ఈ విషయాన్ని ధృవీకరించారు. ముస్తాఫిజుర్‌తో పాటు నహిద్ రాణా, రిషద్ హొస్సేన్, హసన్ మహ్మద్, తౌహిద్ హృదయ్, తస్కిన్ అహ్మద్, షోరిఫుల్ ఇస్లాం వేలం బరిలో నిలవనున్నారు.

Details

రూ.9.20 కోట్లతో మొదలై.. అనూహ్యంగా ముగిసిన ప్రయాణం

ముస్తాఫిజుర్‌కు ఐపీఎల్‌తో గతంలోనే మంచి అనుబంధం ఉంది. 2025 డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్‌ రైడర్స్ అతడిని రూ.9.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది.

చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీపడినా చివరకు కేకేఆర్ అతడిని దక్కించుకుంది.

అతడి కనీస ధర రూ.2 కోట్లు మాత్రమే. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర పలికిన బంగ్లాదేశ్ ఆటగాడిగా గుర్తింపు పొందాడు. అయితే ఈ ఆనందం ఎంతోకాలం నిలవలేదు.

Details

విడుదల వెనుక వివాదం.. ప్రపంచకప్‌పైనా ప్రభావం

బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై దాడులకు సంబంధించిన పరిణామాల నేపథ్యంలో ముస్తాఫిజుర్‌ను జట్టులో కొనసాగించడంపై విమర్శలు వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో బీసీసీఐ సూచనల మేరకు 2026 జనవరిలో కేకేఆర్ అతడిని విడుదల చేసింది.

ఈ నిర్ణయంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. అనంతరం 2026 టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని భద్రతా కారణాలతో ఐసీసీని కోరింది.

ఆ విజ్ఞప్తి తిరస్కరణకు గురికావడంతో బంగ్లాదేశ్ టోర్నీ నుంచి తప్పుకుంది. దాని స్థానంలో స్కాట్లాండ్‌కు అవకాశం దక్కింది.

ADVERTISEMENT

Details

ఏడుగురిలో ఎవరికి ఐపీఎల్ పిలుపు?

ఇప్పుడు మరోసారి ఐపీఎల్ వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లు తమ పేర్లు నమోదు చేసుకోవడం ఆసక్తిని పెంచుతోంది.

ముఖ్యంగా ముస్తాఫిజుర్‌కు ఈసారి ఏ ఫ్రాంచైజీ నుంచి పిలుపు వస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.

అయితే వేలానికి పేరు పంపడం వేరు, జట్టులో స్థానం సంపాదించడం వేరు. ఫ్రాంచైజీల అవసరాలు, ఆటగాళ్ల ప్రదర్శన, ధర వంటి అంశాలే తుది ఎంపికను నిర్ణయించనున్నాయి.

గత చేదు అనుభవాన్ని పక్కనపెట్టి ముస్తాఫిజుర్ మళ్లీ ఐపీఎల్‌లో అడుగుపెడతాడా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

ADVERTISEMENT