Page Loader
గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్
గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్

గాయం కారణంగా యాషెస్ సిరీస్ నుంచి తప్పుకున్న నాథన్ లియాన్

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 03, 2023
03:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

లార్డ్స్ లో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్ పై ఆస్ట్రేలియా 43 పరుగుల తేడాతో గెలుపొందింది. దీంతో యాషెస్ సిరీస్‌లో 2-0 తేడాతో ఆస్ట్రేలియా ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్ లో గాయపడిన ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్, రెండో ఇన్నింగ్స్ లో కుంటుతూ బ్యాటింగ్‌కు వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచని విషయం తెలిసిందే. ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత సబ్‌సిట్ట్యూట్‌గా మరో స్పిన్నర్‌ని తుది జట్టులోకి తీసుకొనే అవకాశం ఉన్నా ఆస్ట్రేలియా దాన్ని వాడుకోలేదు. గాయంతో ఇబ్బందిపడుతూనే లియాన్ 13 బంతులను ఫేస్ చేశాడు. మోకాలి గాయంతో ఇబ్బందిపడుతున్న అతను మిగిలిన యాషెస్ సిరీస్‌కు దూరమయ్యాడు. గాయం నుంచి కోలుకోవడానికి రెండు నెలల సమయం పడుతుందని వైద్యులు సూచించడంతో అతన్ని జట్టు నుంచి తప్పించారు.

Details

మూడు టెస్టు ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే

తొలి టెస్టులో 8 వికెట్లు తీసిన నాథన్ లియాన్, రెండో టెస్టులో 13 ఓవర్లు బౌలింగ్ చేసి ఒకే ఒక్క వికెట్ తీశాడు. గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు. లియాన్ 30 యాషెస్ టెస్టుల్లో 110 వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా 122 అంతర్జాతీయ టెస్టుల్లో లియాన్ 31.01 సగటుతో 496 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుత తరంలో అత్యధిక టెస్టు వికెట్లు తీసిన స్పిన్నర్‌గా ఉన్నాడు. మూడో టెస్టు ఆడే ఆస్ట్రేలియా జట్టు ఇదే వార్నర్, ఉస్మాన్‌ఖవాజా, మార్కస్‌హారిస్, లాబుస్చాగ్నే, స్టీవ్‌స్మిత్, ట్రావిస్ హెడ్, గ్రీన్, మిచెల్ మార్ష్, అలెక్స్ కారీ, కమ్మిన్స్, స్టార్క్,హేజిల్‌వుడ్, టాడ్ మర్ఫీ, స్కాట్ నెస్‌బోలాండ్, మైఖేల్ బోలాండ్, , జిమ్మీ పీర్సన్.