Page Loader
ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!
భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 22, 2025
11:39 am

ఈ వార్తాకథనం ఏంటి

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ ఫిబ్రవరి 23న జరగనుంది. అయితే ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు ముందు ఓ వివాదం చెలరేగింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అధికారిక లోగోలో పాకిస్తాన్ పేరు లేకపోవడంపై పీసీబీ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. లోగో వివాదం - పీసీబీ ఫిర్యాదు ఫిబ్రవరి 20న జరిగిన భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో ప్రత్యక్ష ప్రసారంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 అధికారిక లోగోను ప్రదర్శించారు. అయితే ఆతిథ్య దేశమైన పాకిస్థాన్ పేరు లేకపోవడంతో పాక్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని పేర్కొంటూ ఐసీసీకి లేఖ రాసింది.

Details

ఐసీసీకి పీసీబీ లేఖ

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రసారం సమయంలో లోగోలో పాకిస్థాన్ పేరు లేకపోవడం ఆమోదయోగ్యం కాదని, దుబాయ్‌లో జరిగే మ్యాచ్‌లతో సహా అన్ని ప్రసారాల్లో ఈవెంట్ పేరు, ఆతిథ్య దేశం వివరాలు సరైన విధంగా ఉండాలని పేర్కొంది. ఐసీసీ వివరణ ఈ వివాదంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పందించింది. ప్రసారంలో పాక్ పేరును చూపించకపోవడం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని స్పష్టం చేసింది. ఐసీసీ ప్రతినిధి ప్రకారం భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్ సమయంలో లోగోలో సాంకేతిక కారణాల వల్ల పాక్ పేరు కనిపించలేదు. అయితే, తదుపరి అన్ని ప్రసారాల్లో లోగోను సరిచేస్తామని తెలిపింది.

Details

రేపు పాక్, ఇండియా మ్యాచ్

ఇప్పటికే ఫిబ్రవరి 21న అఫ్గానిస్థాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌లలో లోగోను సరిగ్గా ప్రదర్శించామని ఐసీసీ ప్రస్తావించింది. ఇదిలా ఉంటే ఫిబ్రవరి 23న జరిగే భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్‌కు క్రికెట్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలిస్తే సెమీఫైనల్ అవకాశాలు మెరుగవుతాయి. పాక్ గెలవకపోతే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించే ప్రమాదముంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలుపొందగా, పాక్ న్యూజిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఈ మ్యాచ్ పాకిస్తాన్‌కి డూ ఆర్ డై సమరంగా మారింది.