Tilak Varma : తిలక్ వర్మ ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు.. కోహ్లీని దాటిన తెలుగు కుర్రాడు
ఈ వార్తాకథనం ఏంటి
ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఇంగ్లండ్‌పై భారత్ 2 వికెట్లతో విజయం సాధించింది.
టీమిండియా యువ ఆటగాడు తిలక్ వర్మ 72 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు.
ఈ ఇన్నింగ్స్‌తో తిలక్ వర్మ ఓ అరుదైన ఘనతను సాధించాడు. టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. దీంతో విరాట్ కోహ్లీ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు.
ఇప్పటివరకు నాలుగు ఇన్నింగ్స్‌లలో (19*, 120*, 107*, 72*) 318 పరుగులు సాధించాడు.
గతంలో ఈ రికార్డు కోహ్లీ పేరిట ఉండేది. ఆయన 258 పరుగులు చేశాడు. ఈ జాబితాలో తరువాతి స్థానాల్లో సంజూ శాంసన్ (257), రోహిత్ శర్మ(253), ధావన్ (252) ఉన్నాయి.
Details
తిలక్ వర్మ ఒంటరి పోరాటం
ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ జాబితాలో కూడా తిలక్ వర్మ అగ్రస్థానంలో నిలిచాడు.
ముందుగా ఈ రికార్డు న్యూజిలాండ్ ఆటగాడు మార్క్ చాప్‌మన్ (271 పరుగులు) పేరిట ఉండేది. ఈ జాబితాలో శ్రేయస్ అయ్యర్ (240), ఆరాన్ ఫించ్ (240), డేవిడ్ వార్నర్ (239) కూడా ఉన్నారు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 165 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఛేదించడానికి భారత ఆటగాళ్లు కష్టపడినప్పటికీ, తిలక్ వర్మ ఒంటరిగా పోరాడి జట్టుకు విజయం అందించాడు.
55 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు, 72 పరుగులు సాధించి, అజేయంగా నిలిచాడు. తిలక్ వర్మ విజయం సాధించడంతో భారత్ 5 మ్యాచుల టీ20 సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వచ్చింది.