ODI World Cup 2023: మరో 8 రోజుల్లో వన్డే ప్రపంచ కప్.. ఈ టోర్నీకి దూరమైన స్టార్ ఆటగాళ్లు వీరే!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ 2023 మరో ఎనిమిది రోజుల్లో ప్రారంభం కానుంది. నాలుగేళ్లకు ఓసారి వచ్చే ఈ క్రికెట్ పండుగ కోసం అభిమానులు అతృతుగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 5న ఈ మహా సంగ్రామానికి తెరలేవనుంది. అయితే ఒంటిచేత్తో మ్యాచును గెలిపించే ఆటగాళ్లు, బంతితో ఆట స్వరూపాన్ని మార్చే పేసర్లు కొందరు ఈ మెగా టోర్నీకి దూరమయ్యారు. గాయాల భారీన పడి వన్డే ప్రపంచకప్ టోర్నీకి దూరమైన ఆటగాళ్ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రిషబ్ పంత్ టీమిండియా డాషింగ్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన బ్యాట్‌తో ప్రత్యర్థులకు సమాధానం చెప్పగలడు. 2019 వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా ఇంగ్లండ్ గడ్డపై కీలక ఇన్నింగ్స్‌లతో జట్టును గెలిపించాడు.
గాయం కారణంగా వనిందు హసరంగ దూరం
2023 వరల్డ్ కప్‌లో రిషబ్ పంత్ కి చోటు ఖాయమని అనుకునేలోపే దురదృష్టవశాత్తు కారు ప్రమాదంలో గాయపడ్డాడు. మోకాలికి గాయం కావడంతో పంత్ ముంబైలోని కోకిలా బెన్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. వరల్డ్ కప్‌లో పంత్ టీమిండియాకు ఆడకపోవడం పెద్దలోటే అని చెప్పాలి. వనిందు హసరంగ శ్రీలంక స్పిన్నర్ హసరంగ అనతికాలంలోనే కీలక ఆటగాడిగా ఎదిగాడు. మురళీధరన్, అజంత మెండిస్ తర్వాత హసరంగ రూపంలో ఆ జట్టుకు నాణ్యమైన స్పిన్నర్ దొరికాడు. జింబాబ్వే వేదికగా జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో ఈ ఆల్ రౌండర్ ప్రదర్శన కారణంగానే లంక వరల్డ్ కప్ పోటీలకు అర్హత సాధించింది. అలాంటి వన్డే ప్రపంచ కప్ టోర్నీకి అతడు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద నష్టమే.
వన్డే వరల్డ్ కప్ నుంచి పాక్ పేసర్ నసీం షా ఔట్
జోఫ్రా ఆర్చర్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్‌గా జోఫ్రా ఆర్చర్‌కు మంచి పేరు ఉంది. ఇంగ్లండ్ తొలిసారి 2019లో వరల్డ్ కప్ విజేతగా నిలవడంలో పేసర్ జోఫ్రా కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్ 16వ సీజన్‌కు ముందు ఆర్చర్ కుడి మోచేయికి గాయమైంది. ఆ గాయం నుంచి ఇంకా ఆర్చర్ కోలుకోకపోవడంతో వన్డే వరల్డ్ కప్ టోర్నీకి దూరమయ్యాడు. నసీం షా పాకిస్థాన్ పేసర్ నసీం షా వన్డ్ ప్రపంచ కప్‌పై ఎన్నో ఆశలను పెట్టుకున్నాడు. ఆసియా కప్‌లో భారత జట్టుతో జరిగిన సూపర్ 4 మ్యాచులో నసీం షా గాయపడ్డాడు. దీంతో వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతడి స్థానంలో హసన్ అలీని ఎంపిక చేశారు.
జేసన్ రాయ్ స్థానంలో హ్యారీ బ్రూక్
జేసన్ రాయ్ వన్డే ప్రపంచ కప్ ముందు ఇంగ్లండ్ జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ గాయంతో ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. ఐపీఎల్ 16వ సీజన్ పరుగుల వరద పారించిన రాయ్, కండరాల నొప్పి కారణంగా వన్డే ప్రపంచ కప్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇక అతని స్థానంలో విధ్వంసకర బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఎంపికయ్యాడు. మైఖేల్ బ్రాస్‌వెల్ న్యూజిలాండ్ ఆల్ రౌండర్ మైఖేల్ బ్రాస్ వెల్ బ్యాటింగ్, బౌలింగ్ లోనూ సంచనాలను సృష్టించి ఔరా అనిపించాడు. ఉప్పల్ స్టేడియంలో మెరుపు సెంచరీతో సత్తా చాటాడు.
న్యూజిలాండ్ కు భారీ షాక్
ప్రపంచ కప్‌లో బ్రాస్‌వెల్ సంచనాలను సృష్టిస్తాడని కివీస్ జట్టు భావించింది. అయితే గాయం కారణంగా వన్డే ప్రపంచ కప్ జట్టులో అతను చోటు దక్కించుకోలేకపోయాడు. అన్రిచ్ నార్ట్జ్ ఇప్పటివరకూ ఒక వన్డే వరల్డ్ కప్ టోర్నీ గెలవని దక్షిణాఫ్రికా ఈసారి భారీ కసరత్తులను చేసింది. ఈ తరుణంలో సఫారీ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ అన్రిచ్ నార్ట్జ్ గాయం కారణంగా తప్పుకున్నాడు. మరో పాస్ట్ బౌలర్ మగల కూడా గాయంతో టోర్నీ నుంచి వైదొలిగాడు. వారి స్థానంలో అండిలే పెహ్లూవాకియో, లిజాద్ విల్లియమ్స్ లు ఎంపికయ్యారు.