
Asia Cup 2025: పాక్ కెప్టెన్‌కి పీసీలో విచిత్ర అనుభవం! "మమ్మల్ని ఇక్కడా వదలరా..?"
ఈ వార్తాకథనం ఏంటి
యూఏఈలో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా కి విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. అఫ్గనిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఒక జర్నలిస్ట్ వేసిన ప్రశ్న పాక్ సారథిని ఇబ్బందుల్లోకి నెట్టింది. అటు నవ్వలేక, కోపం చూపలేక, అసౌకర్యంగా కూర్చోక తప్పలేదు. చివరికి - "ఎక్కడికెళ్లినా మమ్మల్ని వదిలిపెట్టరు కదా" అంటూ అయోమయంగా స్పందించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సెప్టెంబర్ 9న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2025 కోసం ఇప్పటికే పాకిస్థాన్, శ్రీలంక జట్లు యూఏఈకి చేరుకున్నాయి. భారత జట్టు మాత్రం సెప్టెంబర్ 5న దుబాయ్ చేరుకోనుంది. టోర్నీకి ముందు భాగంగా యూఏఈ,పాక్,శ్రీలంక జట్లు త్రికోణ సిరీస్‌లో తలపడుతున్నాయి.
వివరాలు
స్టార్ ఆటగాళ్లు లేని కారణంగా పాక్ జట్టుపై విమర్శలు
ఈ నేపథ్యంలో ముగ్గురు జట్ల కెప్టెన్లు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అక్కడ ఒక రిపోర్టర్ రషీద్ ఖాన్‌ను ఉద్దేశించి .."ఆసియాలో రెండో శక్తివంతమైన జట్టుగా గుర్తింపు తెచ్చుకున్న అఫ్గనిస్థాన్ గత వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. ఈసారి ఆసియా కప్ కోసం మీరెలా సిద్ధమవుతున్నారు?" అని ప్రశ్నించాడు. ఆ మాట విన్న పక్కనే కూర్చున్న పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఒక్కసారిగా అసహనంగా కనిపించారు. ఎందుకంటే గతంలో ప్రపంచ క్రికెట్‌లో పాకిస్థాన్‌కి గౌరవప్రదమైన స్థానం ఉండేది. అయితే ఈసారి మాత్రం బాబర్ అజామ్,మహ్మద్ రిజ్వాన్ వంటి స్టార్ ఆటగాళ్లు లేని కారణంగా పాక్ జట్టుపై విమర్శలు, వ్యంగ్యాలు ఎక్కువయ్యాయి. జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న కూడా ఆ దిశగానే ఉందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
వివరాలు
భారత్ - పాక్ మ్యాచ్‌ను చూసే అవకాశం
ఆసియా కప్‌లో అత్యంత ఆసక్తికరమైన భారత్-పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 14న జరగనుంది. రెండు జట్లు సూపర్ 4లోకి ప్రవేశిస్తే మరోసారి తలపడే అవకాశం ఉంది. అదీ కాకుండా ఫైనల్లో తలపడితే అభిమానులకు మూడోసారి భారత్-పాక్ పోరు చూడటానికి అవకాశం లభిస్తుంది. అయితే, పాక్‌తో భారత్ ఆడకూడదని డిమాండ్ చేసే వర్గాలు కూడా ఉన్నాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆ దేశంతో క్రీడా సంబంధాలూ వద్దని డిమాండ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితిలో బీసీసీఐ ఏదైనా అనూహ్య నిర్ణయం తీసుకుంటుందేమో చూడాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రెస్ మీట్
Agha’s reaction when a journalist in PC called Afghanistan the second best team
— 𝐀. (@was_abdd) August 28, 2025
in Asia 😭😭😭😭 pic.twitter.com/vKd4jQImNn