Page Loader
Champions Trophy 2025‌: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు! 
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు!

Champions Trophy 2025‌: ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ జట్టు ఇదే.. ఆ ముగ్గురిపై వేటు! 

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 31, 2025
09:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టును ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) విడుదల చేసింది. శుక్రవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించారు. ఇతర దేశాలు తమ జట్లను ముందుగా ప్రకటించినా, పాకిస్థాన్ జట్టు ఆలస్యంగా ప్రకటించింది. సౌతాఫ్రికా పర్యటనలో బరిలోకి దిగిన పాకిస్థాన్ జట్టులో నాలుగు మార్పులు చేసినట్లు తెలుస్తోంది. 2017లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన జట్టులోని బాబర్ ఆజామ్, ఫహీమ్ అష్రఫ్, ఫకార్ జమాన్ ఈసారి జట్టులో చోటు పొందారు. లెఫ్టార్మ్ పేసర్ షాహిన్ షా అఫ్రిది పాకిస్థాన్ పేస్ విభాగాన్ని నడిపించనున్నాడు. మహమ్మద్ హస్‌నైన్, నసీమ్ షా, హ్యారీస్ రౌఫ్ అతనితో కలిసి పేస్ బాధ్యతలు పంచుకుంటారు.

వివరాలు 

ఫిబ్రవరి 19న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ

అబ్రర్ అహ్మద్ ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉంటుంది. ఆల్‌రౌండర్లు అఘా, కుష్‌దిల్ షా అతనికి మద్దతుగా ఉంటారు. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభానికి ముందు న్యూజిలాండ్, సౌతాఫ్రికాతో జరగనున్న ట్రై సిరీస్‌లో పాకిస్థాన్ ఇదే జట్టుతో బరిలోకి దిగనుంది. ఈ ట్రై సిరీస్ ఫిబ్రవరి 8న ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి 14న కరాచీలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19న ప్రారంభం కానుంది. ఈ టోర్నీ కరాచీ, లాహోర్, రావల్పిండి వేదికలపై జరుగుతుంది, కానీ భారత్ సంబంధిత మ్యాచ్‌లు దుబాయ్‌లో నిర్వహించబడతాయి.

వివరాలు 

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 బరిలోకి దిగే పాకిస్థాన్ జట్టు:

ఓపెనర్ సయీమ్ ఆయుబ్ గాయంతో జట్టులోకి రాలేకపోయాడు. అలాగే ఫామ్‌లో లేని అబ్దుల్లా షఫీక్, ముహమ్మద్ ఇర్ఫాన్,సుఫియాన్ ముఖీమ్‌లపై వేటు వేసారు. వారి స్థానంలో ఫహీమ్ అష్రఫ్,ఫకార్ జమాన్,ఖుషిదిల్ షా,సౌద్ షకీల్ జట్టులోకి వచ్చారు. ఈ మెగా టోర్నీలో వికెట్ కీపర్ మహమ్మద్ రిజ్వాన్ పాకిస్థాన్ జట్టును నడిపించనున్నాడు. ఆల్‌రౌండర్ సల్మాన్ అలీ అఘా అతనికి డిప్యూటీగా బాధ్యతలు నిర్వహిస్తారు. మహమ్మద్ రిజ్వాన్(కెప్టెన్),బాబర్ ఆజామ్, ఫకార్ జమాన్, కమ్రాన్ గులామ్, సౌద్ షకీల్,టయ్యబ్ తాహిర్, ఫహీమ్ అష్రఫ్, కుష్‌దిల్ షా, సల్మాన్ అఘా(వైస్ కెప్టెన్), ఉస్మాన్ ఖాన్, అబ్రర్ అహ్మద్, హ్యారీస్ రౌఫ్, మహమ్మద్ హస్‌నైన్, నసీమ్ షా,షాహిన్ షా అఫ్రిది.