Page Loader
AUS vs PAK: తొలి టెస్టులో పాక్ ఓటమి.. ఆస్ట్రేలియాకు టీమిండియానే గట్టి పోటీ : మైకెల్ వాన్ 
తొలి టెస్టులో పాక్ ఓటమి.. ఆస్ట్రేలియాకు టీమిండియానే గట్టి పోటీ : మైకెల్ వాన్

AUS vs PAK: తొలి టెస్టులో పాక్ ఓటమి.. ఆస్ట్రేలియాకు టీమిండియానే గట్టి పోటీ : మైకెల్ వాన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 18, 2023
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టులో పాక్ 360 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. పేసర్లకు అనుకూలంగా ఉండే పెర్త్ పిచ్‌పై ఆస్ట్రేలియా బ్యాటర్లను కట్టడి చేయడంలో పాక్ బౌలర్లు విఫలమయ్యారు. పాక్ ఓటమితో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC) పాయింట్ల పట్టికలో భారత్ దూసుకొచ్చింది. పాక్‌తో కలిసి సంయుక్తంగా ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్(Michael van) కీలక వ్యాఖ్యలు చేశాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాకు గట్టి పోటీ ఇచ్చే జట్టు టీమిండియానే అని పేర్కొన్నారు. ఆస్ట్రేలియా అద్భుత విజయం సాధించిందని, నాథల్ లియాన్ 500 వికెట్ల క్లబ్‌లో చేరడం అభినందనీయమని మైకెల్ వాన్ కొనియాడారు.

Details

రెండో టెస్టు కోసం జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా

గత రెండు పర్యటనలో ఆసీస్‌ను టీమిండియాను చిత్తు చేసిందని, పాక్ జట్టు ఏ మాత్రం పోటీ ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో డేవిడ్ వార్నర్ అద్భుతంగా ఆడాడని, ఆసీస్ ప్లేయర్లు సమిష్టిగా రాణించారన్నారు. ఇక పాక్‌తో మెల్‌బోర్న్ వేదికగా జరిగే రెండో టెస్టు కోసం 13 మందితో కూడిన జట్టును ఆసీస్‌ను ప్రకటించింది. తొలి టెస్టు జట్టులో ఉన్న అన్ క్యాపెడ్ ప్లేయర్ లాన్స్ మోరిస్‌ను తప్పించింది. ఆస్ట్రేలియా జట్టు ప్యాట్ కమిన్స్‌ (కెప్టెన్), స్కాట్ బొలాండ్, అలెక్స్‌ కేరీ, కామెరూన్ గ్రీన్, జోష్‌ హేజిల్‌వుడ్, ట్రావిస్‌ హెడ్, ఉస్మాన్ ఖవాజా, మార్నస్‌ లబుషేన్, నాథన్‌ లైయన్, మిచెల్ మార్ష్‌, స్టీవ్‌ స్మిత్, మిచెల్‌ స్టార్క్‌, డేవిడ్ వార్నర్‌