
IPL 2025: పంత్‌కు రూ.12 లక్షల జరిమానా.. దిగ్వేశ్‌కు రెపీట్ పెనాల్టీ షాక్!
ఈ వార్తాకథనం ఏంటి
ముంబయి ఇండియన్స్‌ను చిత్తు చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ కు షాక్ తగిలింది.
ఎల్‌ఎస్‌జీ కెప్టెన్ రిషబ్ పంత్, యువ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠికి జరిమానా విధిస్తూ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ నిర్ణయం తీసుకుంది.
లఖ్‌నవూలోని అటల్ బిహారీ వాజ్‌పేయీ ఏకనా స్టేడియం వేదికగా మ్యాచ్ జరిగింది.
పంత్‌కు రూ.12 లక్షలు జరిమానా విధించగా.. యువ బౌలర్ దిగ్వేశ్ వరుసగా రెండోసారి ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ ఆగ్రహానికి గురికావడం గమనార్హం. రిషభ్ పంత్‌కు జరిమానా విధించాం. స్లో ఓవర్ రేట్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.
ఆర్టికల్ 2.22 ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం పంత్‌కు రూ. 12 లక్షలు జరిమానా విధించామని ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ తెలిపింది.
Details
దిగ్వేశ్ ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు
ఐపీఎల్ 2025 సీజన్‌లో 'స్లో ఓవర్ రేట్' కారణంగా జరిమానా ఎదుర్కొన్న మూడో సారథి రిషభ్ పంత్. ఇంతకుముందు హార్దిక్ పాండ్య, రియాన్ పరాగ్‌పై ఫైన్ పడింది.
దిగ్వేశ్ ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ముంబయిపై లఖ్‌నవూ విజయం సాధించడంలో దిగ్వేశ్ రాఠి (Digvesh Rathi) కీలక పాత్ర పోషించాడు.
నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఒక్క వికెట్ తీసి 21 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
కీలకమైన నమన్ ధీర్ (46)ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. దీంతో అతడికే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది.
అయితే, నమన్‌ను ఔట్ చేసిన తర్వాత కూడా 'సంతకం' చేసినట్లుగా సంబరాలు నిర్వహించడంపై మ్యాచ్ రిఫరీ ఐపీఎల్ అడ్వైజరీ కమిటీ దృష్టికి తీసుకెళ్లారు.
Details
మ్యాచులో 50శాతం జరిమానా
ఆర్టికల్ 2.5 కోడ్ ఆఫ్ కండక్ట్ లెవెల్ 1 నేరం కిందకు వస్తుందని.. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా విధించినట్లు కమిటీ వెల్లడించింది.
ఇప్పటికే పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లోనే ఇలానే వ్యవహరించిన సంగతి తెలిసిందే. అప్పుడు ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది.
ఇప్పుడీ ఘటనతో మరో రెండు డీమెరిట్ పాయింట్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో అతడి ఖాతాలో 3 డీమెరిట్ పాయింట్లు ఉన్నట్లైంది.