ODI World Cup 2023 : భారత్‌పై మరోసారి విషం కక్కిన పీసీబీ
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసిన విషయం తెలిసిందే. వరల్డ్ కప్‌లో వరుసగా ఎనిమిదో విజయాన్ని టీమిండియా నమోదు చేసింది. ఊహకు మించి అహ్మదాబాద్ స్టేడియంలో సంబరాలు సాగాయి. ఈ సంబరాలు పాక్ కి నచ్చలేదు. పాక్ ఓటమిని జీర్ణించుకోలేని పాక్ క్రికెట్ బోర్డు(PCB) భారత ఫ్యాన్స్ పై ఐసీసీకి ఫిర్యాదు చేసింది. టీమిండియాతో మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని ప్రేక్షకులు పాకిస్థాన్ ఆటగాళ్ల పట్ల అనుచితంగా ప్రవర్తించారని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు, ఐసీసీ (ICC)కి ఫిర్యాదు చేయడం షాక్ కి గురి చేసింది. అదే విధంగా పాకిస్థానీ జర్నలిస్టులకు వీసాల జారీలో జాప్యం నెలకొనడంపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
పాకిస్థాన్ అభిమానులకు వీసాలు జారీ చేయకపోవడంపై అసంతృప్తి
ఇప్పటికే ఆ జట్టు కోచ్, టీమ్ డైరక్టర్ వన్డే ప్రపంచకప్ నిర్వహణ పట్ల విమర్శలు కురిపించిన విషయం తెలిసిందే. ఇది ఐసీసీ టోర్నమెంట్ మాదిరిగా లేదని, బీసీసీఐ ఈవెంట్‌లా ఉందంటూ ఆ టీమ్ డైరక్టర్ మైక్ ఆర్థర్ విమర్శలు గుప్పించాడు. మరోవైపు భారత్, పాక్ మ్యాచ్ సందర్భంగా పాకిస్థాన్ మ్యూజిక్ ను ప్లే చేయలేదని వాపోయారు. ఇక పాక్ అభిమానులకు వీసాలను జారీ చేయకపోవడం పట్ల ఐసీసీ వద్ద పీసీబీ అధికారికంగా నిరసన తెలిపింది.