Shreyas Iyer: నా కోపాన్ని బయటికి చూపించలేదు.. విమర్శకుల నోళ్లు మూచించిన శ్రేయాస్ అయ్యర్
ఈ వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుతమైన ఫామ్‌ను కనబర్చి ఫైనల్ కు దూసుకెళ్లింది. టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ జట్టులో ని చోటు దండగ అని విమర్శలు వచ్చాయి. అతనికి బదులుగా సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషాన్ ను నాలుగో స్థానంలో ఆడించాలని చాలా డిమాండ్లు వినిపించాయి. విమర్శకులు ఎక్కువ అవుతున్న సమయంలో శ్రేయస్ అయ్యర్ తన సత్తా ఏంటో చూపించారు. సౌతాఫ్రికాపై హాఫ్ సెంచరీ, నెదర్లాండ్స్ పై సెంచరీ, సెమీస్ లో కూడా ఓ శతకంతో చెలరేగాడు. సెమీస్ మ్యాచ్ తర్వాత బ్రాడ్‌కాస్టర్‌తో జరిగిన చాట్‌లో అయ్యర్ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
కెప్టెన్, కోచ్ అండగా నిలిచారు : అయ్యర్
ప్రపంచ కప్ ఆరంభంలో తాను కొన్ని మ్యాచులలో మెరుగైన ప్రదర్శన చేయలేదని, అప్పుడు తాను చాలా కోపంగా ఉన్నానని, అయితే దాన్ని తాను బయటికి చూపించలేదని అయ్యర్ అన్నారు. బ్యాడ్ ఫేజ్‌లో ఉన్నప్పుడు కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తనకు మద్దతుగా నిలిచారని చెప్పారు. బయట నుంచే వచ్చే విమర్శలను పట్టించుకోవద్దని తనకు రోహిత్ సూచించినట్లు అయ్యర్ పేర్కొన్నాడు. ఇదిలా ఉండగా, నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచులో భారత్, ఆస్ట్రేలియాతో తలపడనుంది.