
Rohit Sharma: ఫోన్, పాస్‌పోర్టు సరే.. కానీ ట్రోఫీని కూడా మర్చిపోతావా : రోహిత్ శర్మపై నెటిజన్ల సరదా ట్రోల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
దాదాపు 12 ఏళ్ల తర్వాత భారత జట్టు మరోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేతగా నిలిచింది. ఈ క్రమంలో ముచ్చటగా మూడోసారి ఈ కిరీటాన్ని కైవసం చేసుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దీంతో 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' గా ఎంపికైన సంగతి తెలిసిందే.
ట్రోఫీ మర్చిపోయిన రోహిత్! వీడియో వైరల్
రోహిత్ శర్మ అప్పుడప్పుడు తన పాస్‌పోర్టు, ఫోన్, ఇతర వస్తువులను మర్చిపోతుంటాడని తోటి ఆటగాళ్లు అనేక సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే.
కానీ ఈసారి ఏకంగా 'ఛాంపియన్స్ ట్రోఫీని మర్చిపోయాడు!
Details
రోహిత్ కు గుర్తు చేసిన సిబ్బంది
ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన విలేకరుల సమావేశం లో పాల్గొన్న రోహిత్, మీడియా రూమ్‌లో ట్రోఫీని వదిలేసి వెళ్లిపోయాడు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహాయక సిబ్బందిలోని ఓ సభ్యుడు దీన్ని గుర్తించి, ట్రోఫీని రోహిత్‌కు అందించాడు.
ఈ ఘటనపై నెటిజన్లు సరదా కామెంట్లు చేస్తున్నారు 'ఏందయ్యా రోహిత్.. కష్టపడి గెలిచిన ట్రోఫీని మర్చిపోతావా? అంటూ చలోక్తులు విసురుతున్నారు.
రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై క్లారిటీ
విలేకరుల సమావేశంలో రోహిత్ శర్మ తన రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలపై స్పందించాడు. తాను ఇప్పట్లో వన్డే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పే ఆలోచన లేదని స్పష్టం చేశాడు. ఇటువంటి పుకార్లను వ్యాప్తి చేయవద్దని కోరాడు.
Details
ఐసీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో రోహిత్‌కు దక్కని ప్లేస్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ముగిసిన తర్వాతి రోజు, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ప్రకటించింది.
ఈ జట్టులో భారత్ నుంచి ఆరుగురు ఆటగాళ్లకు చోటు లభిచింది. రోహిత్ శర్మకు మాత్రం ప్లేస్ దక్కకపోవడంతో క్రికెట్ ప్రేమికులను ఆశ్చర్యపరిచింది.
విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రిత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, 12వ ఆటగాడిగా అక్షర్ పటేల్‌కు చోటు లభించింది.
ఈ జట్టుకు కెప్టెన్‌గా న్యూజిలాండ్ ఆటగాడు మిచెల్ సాంట్నర్ ఎంపికయ్యాడు.