
మరింత పడిపోయిన పీవీ సింధు ర్యాంకు
ఈ వార్తాకథనం ఏంటి
డబుల్ ఒలింపిక్ పతక విజేత, భారత స్టార్ షట్లర్ పివి.సింధు బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడింది. మంగళవారం బీడబ్ల్యూఎఫ్ ప్రకటించిన జాబితాలో ఏకంగా మూడు స్థానాలు కోల్పోయి సింధు 15వ ర్యాంకులో నిలిచింది.
గతేడాది బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన తర్వాత ఆమె స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే టాప్-10 లో చోటు కోల్పోయిన సింధు, ప్రస్తుతం మరో ఐదు ర్యాంకులు కిందకు దిగింది.
ప్రస్తుతం సింధు ఖాతాలో 51,070 పాయింట్లు ఉన్నాయి. గాయం నుంచి పూర్తిగా కోలుకొని రీఎంట్రీ ఇచ్చినా మునపటిలా ఫామ్‌ను అందుకోలేకపోయింది.
Details
పురుషుల సింగిల్స్ లో టాప్-10లో ప్రణయ్
ఈ సీజన్‌లో ఒక్క టైటిల్ కూడా సాధించలేకపోయిన సింధు, మాడ్రిడ్ స్పెయిన్ మాస్టర్స్ సూపర్-300 టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. ఈ ఏడాది సింధుకు ఇదే అత్యుత్తమ ప్రదర్శన అని చెప్పొచ్చు.
ఇక పురుషుల సింగల్స్‌లో హెచ్.ఎస్.ప్రణయ్ 8, లక్ష్యసేన్ 19, కిదాంబి శ్రీకాంత్ 20వ స్థానాల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జోడీ మూడో ర్యాంకును నిలబెట్టుకుంది.
అదే విధంగా మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జోడీ 17వ ర్యాంకు సాధించింది.
కెనడాలో ఓపెన్‌లో నేడు సింధు మలేషియా ప్లేయర్ ఎన్‌జీ యంగ్‌తో పోరాడనుంది.