టీమిండియా ఆటగాళ్లపై రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
డిమినికాలోని విండర్స్ పార్క్ స్టేడియంలో వెస్టిండీస్ తో జరిగిన మొదటి మ్యాచులో టీమిండియా విజయం సాధించింది.
టీమిండియా విజయంలో రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు, రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లు తీసి కొత్త చరిత్రను సృష్టించాడు.
అయితే వరల్డ్ డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచులో అశ్విన్ ఎంపిక చేయకపోవడంతో చాలామంది మాజీలు విమర్శలు చేశారు. అసలు టీం మేనేజ్‌మెంట్‌కు బుర్ర ఉందా అంటూ తిట్టిపోశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత ఆడిన తొలి మ్యాచులోనే అశ్విన్ 12 వికెట్లతో విజృంభించాడు.
తాజాగా అశ్విన్ ఇండియన్ ఎక్స్ ప్రెస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో టీమిండియా డ్రెసింగ్ రూమ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Details
సహచరులు, సహోద్యోగుల మధ్య చాలా వ్యత్సాసం ఉంది : అశ్విన్
డ్రెస్సింగ్ రూములో సహచరులు కాకుండా సహోద్యోగులు ఉన్నారని, ప్రస్తుతం సహచరులు, సహోద్యోగుల మధ్య చాలా వ్యత్సాసం ఉందని అశ్విన్ చెప్పారు.
అశ్విన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దూమారం రేపుతున్నాయి. దీనిపై భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా తన యూట్యూబ్ ఛానెల్ వేదికగా స్పందించాడు.
సహచరులు స్నేహితులుగా ఉన్నారా లేదా అనేది ముఖ్యం కాదని పేర్కొన్నారు. ఒకప్పుడు ఆస్ట్రేలియా ప్లేయర్లు ఒకరినొకరు అంతగా ఇష్టపడే వారు కాదని, అయితే ఆస్ట్రేలియాను గెలిపించేందుకు అందరూ తమ శాయశక్తులా ప్రయత్నించేవారని తెలిపారు.
డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం స్నేహపూర్వకంగా లేదని, అయితే ఆటగాళ్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉందని, ప్రతి ఒక్కరూ ఇతరులను అధిగమించాలని కోరుకుంటున్నారని చొప్రా వెల్లడించారు.