
శుభ్‌మాన్ గిల్, శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతి.. సూర్య ఫినిషర్‌గా రావాలన్న గంభీర్
ఈ వార్తాకథనం ఏంటి
ఆస్ట్రేలియాతో జరిగే మూడో వన్డేకు శుభ్‌మన్ గిల్, శార్దుల్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా మేనేజ్‌మెంట్ భావించింది.
ఎల్లుండి రాజ్‌కోట్ వేదికగా ఆస్ట్రేలియా, భారత్ మధ్య మూడో వన్డే ప్రారంభం కానుంది.
ఇప్పటికే మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండు వన్డేల్లో భారత జట్టు గెలుపొంది, సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఇక శుభ్‌మాన్ గిల్, శార్దుల్ ఠాకూర్ నేరుగా గౌహతీలో జరిగే వరల్డ్ కప్ జట్టుతో కలువనున్నారు.
కాగా ఆస్ట్రేలియాతో తొలి రెండు వన్డేల్లో 74, 104 స్కోరుతో గిల్ రాణించిన విషయం తెలిసిందే.
రెండు వన్డేలకు విశ్రాంతి తీసుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హర్ధిక్ పాండ్యా మూడో వన్డే మ్యాచులో ఆడనున్నారు.
Details
సూర్యకుమార్ యాదవ్ పై గౌతమ్ గంభీర్ ప్రశంసలు
వరల్డ్ కప్ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ కీలక పాత్ర పోషిస్తాడని, అతడిని ఫినిషర్‌గా వినియోగించుకుంటే భారత్ కు ప్రయోజనాలు చేకూరుతాయని టీమిండియా మాజీ బ్యాటర్ గౌతమ్ గంభీర్ పేర్కొన్నారు.
సూర్య తుది జట్టులో ఉంటే తప్పకుండా లోయర్ ఆర్డర్ లోనే పంపించాలని, అలాగే ఫైనల్ XI జట్టులో ఎక్కువ మార్పులు చేయకూడదని, సూర్యను ఆరు లేదా ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపాలని చెప్పారు.
సూర్యకుమార్ యాదవ్ చివరి 15-20 ఓవర్లలో క్రీజులో ఉంటే వేగంగా పరుగులొచ్చే అవకాశం ఉందని గంభీర్ తెలియజేశారు.