Page Loader
IPL 2025: రోహిత్ శర్మకు దక్కని చోటు.. ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే! 
రోహిత్ శర్మకు దక్కని చోటు.. ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే!

IPL 2025: రోహిత్ శర్మకు దక్కని చోటు.. ఐపీఎల్ బెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్ ఇదే! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 02, 2025
11:08 am

ఈ వార్తాకథనం ఏంటి

వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ క్రిస్ గేల్ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తరఫున రాణించాడు. 142 మ్యాచ్‌లలో 4,965 పరుగులు చేసిన గేల్, తన ఐపీఎల్ కెరీర్‌లో 6 సెంచరీలు, 31 అర్ధ సెంచరీలు నమోదు చేశాడు. అత్యధికంగా 357 సిక్సర్లు బాదిన రికార్డు ఇప్పటికీ అతని పేరుతోనే ఉంది. అంతేకాకుండా ఐపీఎల్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ (175) రికార్డు కూడా గేల్ ఖాతాలోనే ఉంది. తాజాగా గేల్ తన బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్‌ను ప్రకటించాడు. ఈ జట్టులో ఏడుగురు భారతీయ ఆటగాళ్లు, నలుగురు విదేశీ ఆటగాళ్లకు స్థానం ఇచ్చాడు.

Details

క్రిస్ గేల్ బెస్ట్ ఐపీఎల్ ప్లేయింగ్ ఎలెవన్

తనతో పాటు ఏబీ డివిలియర్స్, డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్ లాంటి స్టార్లను జట్టులోకి తీసుకున్నాడు. ఆసక్తికరంగా ఐపీఎల్‌లో 5 టైటిల్స్ గెలిచిన రోహిత్ శర్మకు జట్టులో చోటు దక్కించుకోలేదు. కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీని ఎంపిక చేశాడు. అలాగే 12వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్‌ను ఎంపిక చేశాడు. క్రిస్ గేల్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, ఏబీ డివిలియర్స్, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోనీ (కెప్టెన్ & వికెట్ కీపర్) డ్వేన్ బ్రావో, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, 12వ ఆటగాడిగా డేవిడ్ వార్నర్