Page Loader
Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత
చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత

Rohit Sharma: చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.. కెప్టెన్‌గా అరుదైన ఘనత

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 21, 2024
12:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ లోనూ కలిపి 11 పరుగులే చేశాడు. అయినా తన ఖాతాలో అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది హిట్ మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 1000 పరుగులను పూర్తి చేశాడు. 2024 క్యాలెండర్ ఇయర్‌లో 27 మ్యాచుల్లో 1,001 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డుకెక్కాడు. వన్డేల్లో 157 పరుగులు, టీ20ల్లో 378 పరుగులు, టెస్టుల్లో 466 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 37 ఏళ్ల 144 రోజులతో ఒకే క్యాలెండర్ సంవత్సరంలో 1000 పరుగులు చేసిన అత్యధిక వయసు కెప్టెన్‌గా చరిత్రలో నిలిచాడు.

Details

యశస్వీ జైస్వాల్ అద్భుత రికార్డు

రోహిత్ ప్రస్తుతం ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక బ్యాటర్ పాథున్ నిస్సాంక (24 మ్యాచుల్లో 1,164 పరుగులు) మొదటి స్థానంలో ఉన్నారు. కుశాల్ మెండిస్ (33 మ్యాచుల్లో 1,161), యశస్వి జైస్వాల్ (1,099), కమిందు మెండిస్ (1,028) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. భారత యువ క్రికెటర్ యశస్వీ జైస్వాల్ కూడా అరుదైన రికార్డును సాధించాడు. పది టెస్టుల్లోనే 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.