Page Loader
Rohit Sharma: రోహిత్‌ శర్మ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు 
Rohit Sharma: రోహిత్‌ శర్మ పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు

Rohit Sharma: రోహిత్‌ శర్మ కాబట్టే ఇంకా టీంలో కొనసాగుతున్నాడు.. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ కీలక వ్యాఖ్యలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 01, 2025
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబయి ఎట్టకేలకు విజయాన్ని నమోదు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన కోల్‌కతా నైట్ రైడర్స్ (Kolkata Knight Riders)తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) విజయం సాధించింది. అయితే, రోహిత్ శర్మ (Rohit Sharma) మరోసారి విఫలమయ్యాడు. కేవలం 13 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్‌ను చేరాడు. ప్రస్తుతం పేలవ ఫామ్‌తో ఇబ్బందిపడుతున్న రోహిత్ ఈ సీజన్‌లో వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఆకట్టుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో అతడిపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ (Michael Vaughan) రోహిత్ పై కఠిన వ్యాఖ్యలు చేశాడు.

వివరాలు 

అద్భుతమైన ఆటగాడి నుంచి ఈ ప్రదర్శన సరికాదు:మైఖేల్ వాన్

"ప్రస్తుతం రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌కు కెప్టెన్ కాదు. అతను కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఉన్నాడు. ఒకసారి అతడి గణాంకాలు చూడండి. ఇవే పరుగులు వేరే ఆటగాడు చేసి ఉంటే, ఈ దశలో జట్టులో స్థానం కోల్పోవాల్సి వచ్చేది. అయితే అతడు రోహిత్ శర్మ కాబట్టి ఇప్పటికీ జట్టులో కొనసాగుతున్నాడు. ఇలాంటి అద్భుతమైన ఆటగాడి నుంచి ఈ ప్రదర్శన సరికాదు. అతడు నిజంగా పరుగులు చేయాల్సిన అవసరం ఉంది. ఆది, అతడిని టీమ్ నుంచి తప్పించమని నేను చెప్పడం లేదు. రోహిత్ శర్మ తిరిగి తన ఫామ్‌ను పొందాలి. ముంబయి తరపున అతడు పెద్ద స్కోర్స్ చేయాల్సిన అవసరం ఉంది," అని మైఖేల్ వాన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

వివరాలు 

మూడు మ్యాచుల్లో రోహిత్ శర్మ 0, 8, 13 పరుగులు

ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ముంబయి ఆడిన మూడు మ్యాచుల్లో రోహిత్ శర్మ 0, 8, 13 పరుగులు చేశాడు. మొత్తం 21 పరుగులే చేసినాడు. గత ఐదు ఐపీఎల్ సీజన్లలో రోహిత్ కేవలం ఒకసారి మాత్రమే 400 పరుగుల మార్కును అందుకున్నాడు.