Asian Games 2023 : కెప్టెన్‌గా రుతురాజ్, కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్.. చైనాలో అడుగుపెట్టిన భారత యువ క్రికెటర్లు!
ఆసియా గేమ్స్‌లో భారత క్రీడాకారులు అన్ని విభాగాల్లో రాణిస్తూ పతకాల పంట పండిస్తున్నారు. తాజాగా ఆసియా గేమ్స్‌లో పతకం సొంతం చేసుకునేందుకు భారత యువ క్రికెటర్ల జట్టు చైనాలో అడుగుపెట్టింది. ఈ భారత జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే ఆసియాక్రీడల్లో మహిళా క్రికెట్ జట్టు స్వర్ణ పతకం సాధించింది. ఇక పురుషుల క్రికెట్ మ్యాచుల్లో భారత్ ప్రస్థానం అక్టోబర్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. శుక్రవారం నుంచి భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టనున్నారు. ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ టోర్నీలో భారత జట్టు నేరుగా క్వార్టర్ ఫైనల్ నుంచే బరిలోకి దిగనుంది. అప్ఘనిస్తాన్, శ్రీలంక, పాకిస్థాన్ జట్లు కూడా నేరుగా క్వార్టర్‌ఫైనల్ ఆడనున్నాయి.
ఆసియా క్రీడలకు ఎంపికైన భారత జట్టు ఇదే
భారత జట్టు రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), ముఖేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దూబే, ప్రభు సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్), యశస్వి జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్.