
sai sudharsan: సాయి సుదర్శన్ సంచలనం.. ఐపీఎల్‌లో సరికొత్త రికార్డు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో యువ ఆటగాడు సాయి సుదర్శన్ తన బ్యాటింగ్ తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు.
బుధవారం జరిగిన రాజస్థాన్ రాయల్స్ (RR) వర్సెస్ గుజరాత్ టైటాన్స్ (GT) మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగిన సుదర్శన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అతడు కేవలం 53 బంతుల్లో 82 పరుగులు చేసి జట్టుకు అద్భుతమైన సహకారాన్ని అందించాడు.
ఈ ఇన్నింగ్స్‌లో ఎనిమిది ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. గుజరాత్ 20 ఓవర్లలో 217 పరుగుల భారీ స్కోర్ నమోదు చేయడంలో అతడి పాత్ర కీలకంగా నిలిచింది.
మ్యాచ్ అనంతరం సుదర్శన్ మాట్లాడుతూ, "మొదట్లో పిచ్‌పై బంతి స్వింగ్ అయింది. జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం కాస్త కష్టంగా అనిపించింది.
Details
వరుసగా ఐదు హాఫ్ సెంచరీలు
కానీ తర్వాత పిచ్‌ను అర్థం చేసుకున్నాం. దానికి తగ్గట్టుగా మేము బ్యాటింగ్ చేశాం. అసలు మన లక్ష్యం మరో 15 పరుగులు చేయాలనే ఉండేది. అయినా తాము మంచిగానే పరుగులు చేశామని చెప్పారు.
ఈ ఇన్నింగ్స్‌తో సాయిసుదర్శన్ ఐపీఎల్ చరిత్రలో కొత్త మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 30 ఇన్నింగ్స్‌ల తర్వాత 1307 పరుగులు చేసి రెండో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మొదటి స్థానంలో 1338 పరుగులతో షాన్ మార్ష్ ఉన్నాడు.
ఐపీఎల్‌లో వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో 50కి పైగా స్కోర్లు చేసిన అరుదైన రికార్డు కూడా సుదర్శన్ ఖాతాలోనే ఉంది.
ఈ అద్భుత ప్రదర్శనతో అతడు టీ20 లీగ్‌లో తన స్థానం పక్కా చేసుకున్నాడు.