స్కాట్లాండ్ ఓటమి.. వన్డే వరల్డ్ కప్‌కు నెదర్లాండ్స్ క్వాలిఫై
ఈ వార్తాకథనం ఏంటి
2023 ఆక్టోబర్‌లో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌కు పసికూన నెదర్లాండ్స్ అర్హత సాధించింది. అద్భుతమైన ప్రదర్శనతో అయిదోసారి ఈ టోర్నీలో పోటీపడే అవకాశాన్ని నెదర్లాండ్స్ కొట్టేసింది.
గురువారం ప్రపంచకప్ క్వాలిఫయర్ సూపర్ సిక్సు మ్యాచులో అద్భుత ప్రదర్శనతో నెదర్లాండ్స్ 4 వికెట్ల తేడాతో స్కాట్లాండ్‌పై విజయం సాధించింది.
ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన బాస్ డె లీడ్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.
తొలుత స్కాట్లాండ్ 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. బ్రాండన్ మెక్‌ములెన్ (106; 110 బంతుల్లో 11×4, 3×6) శతకంతో సత్తాచాటాడు. నెదర్లాండ్స్ లక్ష్యాన్ని 42.5 ఓవర్లలోనే చేధించింది.
Details
ప్రపంచ రికార్డును సృష్టించిన బాస్ డె లీడ్
బాస్ డెలీడ్ ఈ మ్యాచులో ఓ అరుదైన రికార్డును క్రియేట్ చేశాడు. 92 బంతుల్లో 123 పరుగులు చేయడమే కాకుండా బౌలింగ్ ఐదు వికెట్లు పడగొట్టాడు.
ఇలా వన్డేలో సెంచరీతో పాటు ఐదు వికెట్లు తీసిన తొలి నెదర్లాండ్స్ క్రికెటర్‌గా, నాలుగో అటగాడిగా ప్రపంచ రికార్డును సృష్టించాడు.
క్వాలిఫయర్స్ సూపర్ సిక్సులో ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయం సాధించిన శ్రీలంక ఇప్పటికే ప్రపంచ కప్ బెర్తును కన్ఫామ్ చేసుకుంది.
స్కాట్లాండ్‌పై తాజా విజయంతో చివరి బెర్తును నెదర్లాండ్స్ సొంతం చేసుకుంది. ఆ జట్టు 1996, 2003, 2007, 2011 ప్రపంచకప్ లోనూ ఆడింది.