Page Loader
ENG vs IND: రికార్డులను తిరగరాసిన శుభ్‌మన్ గిల్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్‌.. ఆ స్టార్ బ్యాటర్లందరి కంటే గ్రేట్
రికార్డులను తిరగరాసిన శుభ్‌మన్ గిల్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్‌.. ఆ స్టార్ బ్యాటర్లందరి కంటే గ్రేట్

ENG vs IND: రికార్డులను తిరగరాసిన శుభ్‌మన్ గిల్.. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మన్స్‌.. ఆ స్టార్ బ్యాటర్లందరి కంటే గ్రేట్

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
09:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంగ్లండ్ తో బర్మింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత జట్టు కెప్టెన్ శుభమన్ గిల్ అద్భుతమైన డబుల్ సెంచరీతో పలు కీలక రికార్డులను తిరగరాశాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక స్కోరు చేసిన భారత కెప్టెన్‌గా గిల్ పేరు తెచ్చుకున్నాడు. ఇంతకు ముందు ఈ మైదానంలో 2018లో విరాట్ కోహ్లీ 149 పరుగులు చేశాడు. అలాగే 1996లో సచిన్ టెండూల్కర్ 122 పరుగులు నమోదు చేశాడు. విరాట్ 2018లో సచిన్ రికార్డును చెరిపేసిన ఏడేళ్ల తర్వాత, ఇప్పుడు గిల్ ఆ రికార్డులను అధిగమించి కొత్త మైలురాయి చేరుకున్నాడు.

వివరాలు 

అజారుద్దీన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో కెప్టెన్ గిల్

ఇక ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో టెస్ట్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు. ఈ ఘనతను ఇంతకు ముందు కోహ్లీ,రిషబ్ పంత్, సచిన్ టెండూల్కర్, రవీంద్ర జడేజా సాధించారు. ఇంగ్లాండ్ భూమిపై టెస్ట్ మ్యాచ్‌లో 150కి పైగా వ్యక్తిగత స్కోరు చేసిన రెండో భారత కెప్టెన్‌గా గిల్ నిలవడం గమనార్హం. మొహమ్మద్ అజారుద్దీన్ తర్వాత ఈ ఫీట్ సాధించిన రెండో కెప్టెన్ గిల్ కావడం విశేషం. ఈ టెస్ట్ సిరీస్ మొత్తం గిల్ అద్భుత ఫామ్‌లో కొనసాగుతున్నాడు.ఇప్పటికే వరుసగా రెండు టెస్టుల్లో సెంచరీలు చేశాడు. మొదటి టెస్ట్‌లో లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. అయితే ఆ మ్యాచ్‌లో భారత్ 31 పరుగుల తేడాతో ఓటమి చెందింది.

వివరాలు 

భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్లు: 

కాగా, ఇటీవల రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత గిల్ కెప్టెన్ అయ్యాడు. బర్మింగ్‌హామ్ టెస్ట్‌ మైదానంలో భారత కెప్టెన్‌గా అత్యధిక వ్యక్తిగత స్కోర్లు: శుభ్‌మన్ గిల్ - 250+* (2025) విరాట్ కోహ్లీ - 149 (2018) ఎంఎస్ ధోని - 77 (2011) ఎంఎస్ ధోని - 74* (2011) విరాట్ కోహ్లీ - 51 (2018)

వివరాలు 

బర్మింగ్‌హామ్ మైదానంలో భారత ఆటగాళ్ల అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోర్లు: 

శుభ్‌మన్ గిల్ - 250+* (2025) విరాట్ కోహ్లీ - 149 (2018) రిషబ్ పంత్ - 146 (2022) సచిన్ టెండూల్కర్ - 122 (1996) రవీంద్ర జడేజా - 104 (2022)

వివరాలు 

ఇంగ్లాండ్ గడ్డపై భారత కెప్టెన్సీలో అత్యధిక టెస్ట్ వ్యక్తిగత స్కోర్లు: 

మొహమ్మద్ అజారుద్దీన్ - 179 (1990) మాంచెస్టర్ శుభ్‌మన్ గిల్ - 205+* (2025) బర్మింగ్‌హామ్ విరాట్ కోహ్లీ - 149 (2018) బర్మింగ్‌హామ్ అలీ ఖాన్ పట్టౌడి - 148 (1967) లీడ్స్ శుభ్‌మన్ గిల్ - 147 (2025) లీడ్స్