Soumya Sarkar: 14 ఏళ్ల సచిన్ రికార్డు బద్దలు.. అదరగొట్టిన బంగ్లాదేశ్ ప్లేయర్
టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) 14 ఏళ్ల రికార్డు బద్దలైంది. బంగ్లాదేశ్ బ్యాటర్ సౌమ్య సర్కార్ సరికొత్త రికార్డును సృష్టించాడు. సచిన్ పేరిట ఉన్న అరుదైన రికార్డును చెరిపేశాడు. బుధవారం నెల్సన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఓపెనర్ సౌమ్య సర్కార్ (Soumya Sarkar) 151 బంతుల్లో 169 పరుగులు చేశాడు. ఇందులో 22 ఫోర్లు, 2 సిక్సులు ఉన్నాయి. న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన టెండూల్కర్ రికార్డును సౌమ్య సర్కార్ అధిగమించాడు. 2009లో, 'మాస్టర్ బ్లాస్టర్' సచిన్ టెండూల్కర్ కివీస్‌పై అజేయంగా 163 పరుగులతో రాణించిన విషయం తెలిసిందే.
ఏడు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం
వన్డే ఫార్మాట్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్‌గా అదే మైదానంలో సౌమ్య సర్కార్ 164 పరుగులు చేసి సత్తా చాటాడు. మ్యాచ్ విషయానికొస్తే, మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.5 ఓవర్లలో 291 పరుగులు చేసి ఆలౌటైంది. లక్ష్య చేధనలో న్యూజిలాండ్ 46,2 ఓవర్లలో టార్గెట్ ను ఛేదించింది. న్యూజిలాండ్ బ్యాటర్లలో విల్ యంగ్ (89), రచిన్ రవీంద్ర (45), నికోలస్ (95), టామ్ లాథమ్ 34 రన్స్ తో రాణించారు.