World Cup 2023 points table: పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లిన సౌతాఫ్రికా.. టాప్-3లో ఇండియా
వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 10వ మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో సమూల మార్పులు జరిగాయి. ఈ మెగా టోర్నీలో అండర్ డాగ్స్‌గా బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా, వరుసగా రెండో విజయం సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. మరో వైపు ఈ టోర్నీలో రెండు పరాజయాలు చవిచూసిన ఆస్ట్రేలియా 9వ స్థానానికి దిగజారింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మ్యాచుకు ముందు టాప్ లో ఉన్న న్యూజిలాండ్ రెండో స్థానానికి పడిపోయింది. ఇండియా 2 మ్యాచుల్లో విజయం సాధించి 4 పాయింట్ల, 1.500 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో ఉంది. ఇక పాకిస్థాన్ 2 మ్యాచులలో 4 పాయింట్లు, 0.927 నెట్ రన్‌రేట్‌తో నాలుగో స్థానంలో ఉంది.
9వ స్థానంలో ఆస్ట్రేలియా
ఇక డిఫెడింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ 2 మ్యాచులలో ఒక గెలుపు, మరో ఓటమితో ఐదో స్థానంలో ఉంది. ఆ తర్వాత వరుసగా బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఆఫ్గానిస్తాన్ ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ఆస్ట్రేలియా ఏకంగా నెదర్లాండ్స్ జట్టు కంటే కూడా కిందికి దిగజారడం గమనార్హం. తొలి మ్యాచులో ఇండియా చేతిలో ఓడిన ఆసీస్, రెండో మ్యాచులో సౌతాఫ్రికా చేతిలో పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా సెమీఫైనల్ లో రేసులో నిలవాలంటే ఇంగ్లండ్, న్యూజిలాండ్, పాకిస్థాన్ లాంటి బలమైన జట్లతో పోటీ పడాల్సి ఉంది.