IND Vs SA : వరల్డ్ కప్ ఫైనల్ ఓటమిని మరిపించాలంటే.. రోహిత్ శర్మకు ఇదొక అద్భుతావకాశం: గవాస్కర్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో భారత జట్టు ఓటమిపాలైన విషయం తెలిసిందే.
వరుసగా పది మ్యాచుల్లో నెగ్గి, ఫైనల్లో భారత్ చేతులెత్తేసింది.
నరేంద్ర మోదీ స్టేడియంలో దాదాపు లక్ష మందికి పైగా అభిమానుల మధ్య ఎదురైన ఘోర పరాభవం కారణంగా ఆటగాళ్లంతా భావోద్వేగానికి లోనయ్యారు.
ఈ ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) విశ్రాంతి తీసుకుంటున్నాడు.
తాజాగా సౌతాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్ కు రోహిత్ ఎంపికయ్యాడు. ఇక టీ20లు, వన్డేలకు దూరమయ్యాడు.
సౌతాఫ్రికా టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా ఓ అరుదైన రికార్డును నెలకొల్పవచ్చని టీమిండియా(Team India) క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్(Sunil Gavaskar) అభిప్రాయపడ్డాడు.
Details
రోహిత్ శర్మ టెస్టుల్లో పెద్ద పాత్ర పోషించగలడు
సౌతాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలిస్తే వన్డే వరల్డ్ 2023 ఫైనల్లో ఎదురైన పరాభవాన్ని కొంతమేర అయినా తగ్గించే అవకాశం ఉంటుందని గవాస్కర్ చెప్పాడు.
గత 6-8 నెలల్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుత ఫామ్ లో ఉన్నారని, జాక్వెస్ కలిస్ చెప్పినట్లుగా టెస్ట్ సిరీస్‌లో రోహిత్ శర్మ భారత్‌కు కీలకంగా వ్యవహరించనున్నాడని పేర్కొన్నాడు.
ప్రపంచకప్ ఫైనల్ ఓటమిని భర్తీ చేసేందుకు రోహిత్ శర్మకు ఇదే అవకాశమని సునీల్ గవాస్కర్ వెల్లడించారు.
రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా డిసెంబరు 26 నుంచి రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తిరిగి జట్టుతో కలవనున్నారు