IND vs NZ : న్యూజిలాండ్‌పై సూపర్ విక్టరీ.. ఛాంపియన్ ట్రోఫీ టీమిండియాదే
ఈ వార్తాకథనం ఏంటి
భారత జట్టు చరిత్రను సృష్టించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచులో భారత జట్టు 4 వికెట్ల తేడాతో గెలుపొందింది.
దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదట న్యూజిలాండ్ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది.
లక్ష్య చేధనలో టీమిండియా 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను చేధించింది.
ఒక దశలో న్యూజిలాండ్ స్పిన్నర్లు కొంచెం ఇబ్బంది పెట్టినా, మిడిలార్డర్ బ్యాటర్లు చకచక్యంగా రాణించారు.
Details
హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ శర్మ
టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ 76 పరుగులు, శ్రేయాస్ అయ్యర్ 48 పరుగులు చేసి ఆ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
చివర్లో అక్షర్ పటేల్ 29, కేఎల్ రాహుల్ 34, హర్ధిక్ పాండ్యా 18 పరుగులు చేసి ఫర్వాలేదనిపించారు.
రవీంద్ర జడేజా చివర్లో ఫోర్ కొట్టి మ్యాచును ముగించాడు.
న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్, బ్రాస్ వెల్ రెండు వికెట్లు, రచిన్ రవీంద్ర, జెమిషన్ తలా ఓ వికెట్ తీశారు.