IND Vs SA: సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకర శతకం.. సఫారీలపై సిరీస్ సమం
ఈ వార్తాకథనం ఏంటి
సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) విధ్వంసకర శతకం.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) స్పిన్ మాయాజాలంతో భారత జట్టు దక్షిణాఫ్రికాపై (IND Vs SA) విజయం సాధించింది.
ఏకంగా 106 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది.
బ్యాటర్ల మెరుపులకు బౌలర్ల సహకారంతో తోడవడంతో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది.
ఈ మ్యాచులో సూర్యకుమార్ యాదవ్ 56 బంతుల్లో 100 పరుగులతో చెలరేగగా, అనంతరం కుల్దీప్ ఐదు వికెట్లు పడగొట్టి టీమిండియా విజంలో కీలక పాత్ర పోషించారు.
తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
లక్ష్య చేధనలో సౌతాఫ్రికా 13.5 ఓవర్లలో 95 పరుగులు చేసి కుప్పకూలింది.
Details
సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్
టీమిండియా బ్యాటర్లలో సూర్యకుమార్ యాదవ్ 7 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో శతకం పూర్తి చేసి ఆకాశమే హద్దుగా చెలరేగి నాలుగో సెంచరీని పూర్తి చేశాడు.
జైస్వాల్ 60 రన్స్‌తో రాణించాడు. గిల్(8), తిలక్ వర్మ (0), రింకూ సింగ్ (14), జితేశ్ వర్మ (4), జడేజా (4) విఫలమయ్యారు.
లక్ష్య చేధనలో దక్షిణాఫ్రికా బ్యాటర్లు పూర్తిగా తేలిపోయారు.
కెప్టెన్ మార్క్రమ్ 25, డేవిడ్ మిల్లర్ 35 పరుగులు మినహా మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు.
హెన్రిక్స్ (8), బ్రీట్జ్ (4), క్లాసెన్ (5), ఫెలుక్వాయో (0) వరుసగా పెవిలియానికి క్యూ కట్టారు.
ఈ సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'తో పాటు 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.