పదేళ్లుగా ఐసీసీ ట్రోఫీని గెలవని టీమిండియా.. కారణమిదే!
ఈ వార్తాకథనం ఏంటి
బీసీసీఐ ప్రపంచంలోని అత్యంత ధనిక క్రికెట్ బోర్డులలో ఒకటి. ఎంతోమంది స్టార్ ఆటగాళ్లను బీసీసీఐ తయారు చేసింది. అయినప్పటికీ ఐసీసీ మెయిన్ టోర్నమెంట్లలో టీమిండియా చేతులేత్తుస్తోంది.
గత పదేళ్లుగా ఒక ఐసీసీ కూడా ట్రోఫీని కూడా భారత్ గెలవలేదు. 2011లో వరల్డ్ కప్ ను ఎంఎస్ ధోని సారథ్యంలో అందుకున్న టీమిండియా, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ అందుకొని సంచలన రికార్డు సృష్టించింది. 2013 నుంచి 2023 వరకు ఒక్క ఐసీసీ టోర్నీని కూడా భారత్ సాధించలేకపోయింది.
అయితే ఐసీసీ టోర్నీని గెలవకపోవడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్పొచ్చు.
2014లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచులో శ్రీలంకపై టీమిండియా ఓడిపోయింది. మిడిలార్డర్ బ్యాటర్ యువరాజ్ విఫలంకావడంతో పరాజయాన్ని చవిచూసింది.
Details
టీమిండియాకు అందని ద్రాక్షలా ఐసీసీ ట్రోఫీ
2017 వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. ఈ మ్యాచులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో పరాజయాన్ని చవిచూసింది. అదే ఏడాది ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచులో పాక్ పై టీమిండియా తలపడింది. ఈ మ్యాచులో భారత్ ను పాకిస్థాన్ చిత్తు చేసింది.
అదే విధంగా 2016 టీ20 వరల్డ్ కప్ లో టీమిండియాపై వెస్టిండీస్ గెలుపొందింది. ఈ మ్యాచులో భారత బౌలర్లు చేతులెత్తేయడంతో భారత్ ఓడిపోయింది.
ముఖ్యంగా గెలిచే మ్యాచుల్లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు నిరాశపరుస్తుండటంతో టీమిండియా ఐసీసీ ట్రోఫీ అందని ద్రాక్షలా మారింది. ఈ 10 సంవత్సరాలలో టీమిండియా మొత్తం 4 సార్లు ఐసీసీ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరుకుని విఫలమైంది.