Page Loader
Rahul Dravid : టీమిండియా ఆటగాళ్లకు మోటివేషన్ అవసరం లేదు : రాహుల్ ద్రావిడ్
టీమిండియా ఆటగాళ్లకు మోటివేషన్ అవసరం లేదు : రాహుల్ ద్రావిడ్

Rahul Dravid : టీమిండియా ఆటగాళ్లకు మోటివేషన్ అవసరం లేదు : రాహుల్ ద్రావిడ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 25, 2023
05:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే వరల్డ్ కప్ 2023లో వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత జట్టు, చివరి మెట్టుపై బోల్తా పడింది. ఆస్ట్రేలియా చేతిలో ఓటమి కారణంగా ఆటగాళ్లతో పాటు కోట్లాది అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. ఈ పరిణామాల తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma), విరాట్ కోహ్లీ(Virat Kohli) దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్(Rahul Dravid) ఆసక్తికర వ్యాఖ్యలను చేశారు. భారత ఆటగాళ్లకు మోటివేషన్ అవసరం లేదని, నిరాశ నుంచి ఎలా బయటపడాలో వాళ్లకి తెలుసనని పేర్కొన్నాడు.

Details

ఓటమి నుంచి ముందుకెళ్లాలి : ద్రావిడ్

వరల్డ్ కప్ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందని, అది గతమని దాని గురించి అలోచిస్తూ ఉంటే మ్యాచులను గెలవలేమని రాహుల్ ద్రావిడ్ చెప్పాడు. ఓడిన ప్రతిసారి ఆడటానికి సరికొత్త ఇన్నింగ్స్ ఉంటుందని, గతంలో ఎదురైన నిరాశలోనే కూరుకుపోకూడదని వెల్లడించారు. ఓటమి నుంచి ముందుకెళ్లాలని, లేకపోతే అది ఆటపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందన్నారు.