వెస్టిండీస్ సిరీస్ తర్వాత ఐర్లాండ్ టూర్‌కు టీమిండియా
టీమిండియా, వెస్టిండీస్‌తో టెస్టు, వన్డే, టీ20 సిరీస్ లు ఆడనుంది. ఆ సిరీస్ తర్వాత భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఆ పర్యటనలో టీమిండియా మూడు టీ20 సిరీస్ లను ఆడనుంది. వెస్టిండీస్ సిరీస్ కోసం ఇప్పటికే టెస్టు, వన్డే సిరీస్ కోసం జట్టును ప్రకటించగా, టీ20 సిరీస్‌కు మాత్రమే ఇంకా జట్టును ప్రకటించలేదు. అయితే భారత్, ఐర్లాండ్ మధ్య టీ20 సిరీస్ ఆగస్టు 18న ప్రారంభం కానుంది. చివరి మ్యాచ్ ఆగస్టు 23న జరగనుంది. డబ్లిన్ శివారులోని మలహైడ్ క్రికెట్ క్లబ్ స్టేడియంలోనే ఈ మూడు మ్యాచులు జరగనున్నాయి. గతేడాది ఐర్లాండ్ పర్యటించిన టీమిండియా జట్టు రెండు టీ20లను ఆడి సిరీస్ ను క్లిన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే.
భారత జట్టు రెండోసారి రావడం సంతోషంగా ఉంది : డ్యూట్రోమ్
12 నెలల్లో రెండోసారి ఐర్లాండ్ కు వస్తున్న భారత జట్టుకు స్వాగతం పలకడం సంతోషంగా ఉందని క్రికెట్ ఐర్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ వారెన్ డ్యూట్రోమ్ పేర్కొన్నారు. భారత జట్టు నిరంతరం పర్యటనల్లో ఉన్నప్పటికీ ఐర్లాండ్ సిరీస్ ను పరిగణలోకి తీసుకున్నందుకు కృతజ్ఞతలని, పెద్ద సంఖ్యలో అభిమానులు మ్యాచును చూసేందుకు వీలు కల్పిస్తోందని అతను పేర్కొన్నాడు. అయితే ఐర్లాండ్ పర్యటకు టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనలో బీసీసీఐ యువ ప్లేయర్లకు అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఐర్లాండ్ సిరీస్ ముగిసిన వెంటనే భారత జట్టు వరల్డ్ కప్ ఆడనుంది.