Page Loader
4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే?
కోచ్ రాహుల్ ద్రావిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ

4 నెలల్లో 12 వన్డేలు ఆడనున్న టీమిండియా.. ఏ జట్టుతో ఎన్ని మ్యాచులంటే?

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 19, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచ కప్ సమయం దగ్గర పడుతోంది. ఇంకా 4 నాలుగు నెలల్లో భారత్ వేదికగా వన్డే ప్రపంచ కప్ మొదలు కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్‌కు ముందు టీమిండియా 12 వన్డే మ్యాచులను ఆడనుంది. ఈ మ్యాచుల్లో తమ లోపాలను సవరించుకొని వన్డే కప్ ను ఈసారీ సాధించాలని భారత్ భావిస్తోంది. భారత క్రికెట్ జట్టు ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్, ఐసీసీ ట్రోఫీలో పరాజయం పాలైంది. ఇక అక్టోబర్-నవంబర్ మధ్యలో జరిగే వన్డే ప్రపంచ కప్‌పై టీమిండియా దృష్టి సారించనుంది. అంతకంటే ముందు వచ్చే నెలలో భారత్, వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా 3 వన్డే మ్యాచులను ఆడనుంది.

Details

మిడిలార్డర్ బ్యాటర్ కోసం టీమిండియా ఎదురుచూపులు!

ఈ ఏడాది జరిగే ఆసియా కప్‌లో భారత్ ఫైనల్‌కు చేరితే ఆరు వన్డే మ్యాచులను ఆడే అవకాశం ఉంది. వెస్టిండీస్ పర్యటన తర్వాత టీమిండియా, ఆస్ట్రేలియాకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ పర్యటనలో ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డే మ్యాచులు జరగనున్నాయి. దీని తర్వాత వన్డే ప్రపంచ కప్ మొదలు కానుంది. ప్రస్తుతం టీమిండియా బలమైన ఓపెనింగ్ జోడీని లేదా బలమైన మిడిల్ అర్డర్ ను సిద్ధం చేయాల్సి ఉంది. మిడిలార్డర్‌లో శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ బాగానే హ్యాండిల్ చేసేవారు. ప్రస్తుతం వారిద్దరూ గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు. జట్టును గాడిలో పెట్టడానికి కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రావిడ్ శ్రమించాల్సి ఉంటుంది.