
IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?
ఈ వార్తాకథనం ఏంటి
ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్‌పై అసంతృప్తి నెలకొంది.
తాజాగా గురువారం ధర్మశాలలో జరగాల్సిన పంజాబ్ కింగ్స్-ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్థాంతరంగా రద్దయ్యింది.
భద్రతా కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు స్పష్టం చేశారు.
మ్యాచ్ రద్దు నేపథ్యంలో బీసీసీఐ అత్యవసరంగా సమావేశమై, టోర్నీ భవితవ్యంపై కీలక నిర్ణయం తీసుకోనుంది.
పాకిస్థాన్ మిస్సైల్ దాడుల నేపథ్యంలో టోర్నీ నిర్వహణ కష్టంగా మారినట్లు బీసీసీఐ వర్గాలు భావిస్తున్నాయి.
పరిస్థితిని బట్టి ఐపీఎల్ 2025ను తాత్కాలికంగా వాయిదా వేయడం లేదా పూర్తిగా రద్దు చేయడం వంటి ఎంపికలను బోర్డు పరిశీలిస్తోంది.
Details
భద్రతే ప్రథమ ప్రాధాన్యత: దేవజిత్ సైకియా
ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా మాట్లాడుతూ, దేశంలో ప్రస్తుతం పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయని తెలిపారు.
ధర్మశాలలో మ్యాచ్ నిర్వహణ ప్రమాదకరమని అంచనా వేసి, రద్దు చేయాల్సి వచ్చింది.
ప్రస్తుతం పెరిగిన ఉద్రిక్తతల నేపథ్యంలో, ఆటగాళ్లు, ప్రేక్షకులు, సపోర్ట్ స్టాఫ్ భద్రతే మాకు ముఖ్యమైంది.
దేశ ప్రయోజనాల కోసం ఏ నిర్ణయమైనా తీసుకోవడానికి సిద్ధం. పరిస్థితిని తక్కువచేసి చూడడం లేదు. భద్రతా అంశాల ప్రకారమే టోర్నీ నిర్వహణపై తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
Details
'ఆపరేషన్ సిందూర్' నేపథ్యం
గత నెల 22న జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు మంగళవారం 'ఆపరేషన్ సిందూర్' చేపట్టాయి.
పాకిస్థాన్ శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించగా, దాదాపు 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు సమాచారం.
ఈ దాడికి 'ఆపరేషన్ సిందూర్'గా నామకరణం చేశారు. భారత్‌లో మహిళల సింధూరాన్ని నేలకూల్చిన దాడికి బదులుగా ఈ చర్య చేపట్టారని అధికారులు తెలిపారు.
Details
పాక్ ప్రతిదాడి ప్రయత్నాలు
ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాకిస్థాన్ మిస్సైల్ దాడులకు పాల్పడుతుంది.
అయితే భారత సైన్యం అప్రమత్తంగా వ్యవహరిస్తూ, పాక్ ప్రయోగించిన మిస్సైల్‌ను గాల్లోనే నిర్వీర్యం చేసింది.
అంతేకాకుండా లాహోర్‌లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను ధ్వంసం చేయడమేగాక, మూడు పాకిస్థాన్ యుద్ధవిమానాలను కూల్చివేసింది.
ఈ ఉద్రిక్తతల మధ్య, భారత ప్రభుత్వం ధర్మశాల, అమృత్‌సర్, ఛండీగడ్, జమ్మూ, శ్రీనగర్ సహా 18 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్ 2025పై ఆందోళన నెలకొన్నది. బీసీసీఐ త్వరలోనే సీజన్‌పై తుది ప్రకటన చేయనుంది.