
MI vs DC: ఓడిన జట్టు ఔట్.. వాంఖడే వేదికగా ముంబయి-ఢిల్లీ మధ్య ఉత్కంఠ భరిత పోరు
ఈ వార్తాకథనం ఏంటి
ఐపీఎల్ 2025లో భాగంగా 63వ మ్యాచ్ ఇవాళ ముంబైలోని చారిత్రాత్మక వాంఖడే స్టేడియంలో జరగనుంది.
ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఒకదానితో ఒకటి ఢీకొనబోతున్నాయి.
ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా సజీవంగా ఉన్న రెండు జట్లు కావడంతో, ఈ పోరుకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడింది.
క్రికెట్ అభిమానులంతా ఇప్పుడు ఈ మ్యాచ్ వైపు ఆసక్తిగా చూస్తున్నారు.
Details
మూడు జట్లు ఇప్పటికే ప్లేఆఫ్స్‌లోకి..
ఇప్పటికే మూడు జట్లు ప్లేఆఫ్ టికెట్ ఖాయించుకోగా, ఐదు జట్లు ట్రోఫీ ఆశలతో బయటపడ్డాయి.
ఇప్పుడు మిగిలిన రెండు జట్లలో ముంబై లేదా ఢిల్లీ ఒకే జట్టు ప్లేఆఫ్ రేసులోకి ప్రవేశించే అవకాశం ఉంది.
ముంబై ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే, పాయింట్ల పట్టికలో 16 పాయింట్లతో ప్లేఆఫ్‌కి అర్హత సాధిస్తుంది.
అదే సమయంలో ఢిల్లీ గెలిస్తే 15 పాయింట్లతో రేసును ఉత్కంఠభరితంగా మార్చుతుంది.
Details
హెడ్ టు హెడ్ గణాంకాల్లో ముంబైకే ఆధిక్యం
ఇప్పటి వరకూ ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య 36 మ్యాచ్‌లు జరిగాయి.
వీటిలో ముంబై 20 విజయాలు సాధించగా, ఢిల్లీ 16 సార్లు గెలిచింది. IPL 2025 సీజన్‌లో గతసారి ఈ రెండు జట్లు తలపడినప్పుడు, ముంబై ఢిల్లీపై 12 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఫేవరెట్‌గా నిలుస్తోంది. ముంబయి జట్టు గత 7 మ్యాచ్‌ల్లో 6 విజయాలను సాధించింది. ముఖ్యంగా ముంబై ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉన్నారు.
మరోవైపు, ఢిల్లీ క్యాపిటల్స్ మాత్రం వరుసగా మూడు మ్యాచ్‌ల్లో పరాజయాన్ని చవిచూసింది.
దీంతో జట్టు మనోధైర్యం తగ్గినట్టు కనిపిస్తోంది. ఏదిఏమైనా వాంఖడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ గెలిచే అవకాశం మరింత ఎక్కువగా కనిపిస్తోంది.