Most Consecutive Test Wins: టెస్టు క్రికెట్ చరిత్రలో వరుసగా అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన అగ్రశ్రేణి జట్లు
క్రికెట్‌లో అత్యంత కఠినమైన ఫార్మాట్ టెస్ట్ క్రికెట్ అని చెప్పవచ్చు.ఎందుకంటే ఏ జట్టుకైనా ఇందులో విజయం సాధించడం సులభం కాదు. కానీ, అనేక జట్లు ఈ ఫార్మాట్ ను ఏళ్ల తరబడి శాసించి విజయాలనువారి ఖాతాలో వేసుకున్నాయి. మొదట్లో, వెస్టిండీస్ క్రికెట్ జట్టును ఓడించడం చాలా కష్టం ఉండేది. ఆ తరువాత, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కూడా ఈ ఫార్మాట్‌లో తన వైభవాన్ని చాటింది. ఇప్పుడు, వరుసగా ఎక్కువ టెస్టు మ్యాచ్‌లలో విజయం సాధించిన జట్ల గురించి తెలుసుకుందాం.
16 మ్యాచ్‌లలో ఆస్ట్రేలియా విజయం
ఆస్ట్రేలియా జట్టు ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. టెస్టు క్రికెట్ చరిత్రలో, ఆ జట్టు రెండు సార్లు వరుసగా 16 మ్యాచ్‌లలో విజయాన్ని సాధించింది. ఈ విజయం మొదట 1999లో స్టీవ్ వా కెప్టెన్సీలో ప్రారంభమైంది. 2001 ఫిబ్రవరి 27 వరకు, ఆ జట్టు 16 మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఇక, రికీ పాంటింగ్ కెప్టెన్సీలో కూడా 2005లో ఈ ఘనత సాధించింది. 2008 జనవరి 2 వరకు, ఆ జట్టు 16 వరుస మ్యాచ్‌లలో విజయం సాధించింది. ఆస్ట్రేలియా తరువాత, వెస్టిండీస్ జట్టు వరుసగా 11 టెస్టుల్లో విజయం సాధించింది. 1984లో ఆస్ట్రేలియాపై గెలుపుతో ప్రారంభమై, అదే సంవత్సరం డిసెంబర్ నెలలో, ఆ జట్టు తన 11వ విజయం సాధించింది.
మూడవ స్థానంలో శ్రీలంక, దక్షిణాఫ్రికా
ఆ సమయంలో,వెస్టిండీస్ కెప్టెన్ క్లైవ్ లాయిడ్. ఆ కాలంలో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ చాలా భయంకరంగా ఉండేదన్న పేరు ఉంది. మూడవ స్థానంలో, శ్రీలంక, దక్షిణాఫ్రికా క్రికెట్ జట్లు వరుసగా 9 టెస్టుల్లో విజయం సాధించాయి. 2001లో సనత్ జయసూర్య కెప్టెన్సీలో శ్రీలంక విజయాల పరంపర మొదలైంది. 2003లో తమ 9వ విజయాన్ని బంగ్లాదేశ్‌పై సాధించింది. ఈ జాబితాలో ఆస్ట్రేలియా,ఇంగ్లండ్ జట్లు నాలుగో స్థానంలో ఉన్నాయి. 1920-21లో, ఆస్ట్రేలియా జట్టు వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇంగ్లండ్ జట్టు, కెప్టెన్ మైఖేల్ వాన్ నేతృత్వంలో, మే 2004 నుండి డిసెంబర్ 2004 వరకు, వరుసగా 8 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.