AFG vs PAK: బాధను తట్టుకోలేక సహనం కోల్పోయిన పాక్ టీమ్ డైరక్టర్
ఈ వార్తాకథనం ఏంటి
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా పాకిస్థాన్‌పై ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డే విజయం సాధించింది.
వన్డే చరిత్రలో తొలిసారి పాకిస్థాన్‌పై ఆఫ్గాన్ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.
ఇదే టోర్నీలో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌ను కూడా ఆఫ్గాన్ చిత్తు చేసింది. చైన్నైలోని చెపాక్ మైదానంలో జరిగిన ఈ మ్యాచులో పాకిస్థాన్ మొదట 282 పరుగులు చేసింది.
లక్ష్య చేధనలో ఆప్గాన్ 49 ఓవర్లో 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్ ఓటమితో పాక్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి.
ఆప్గాన్ బ్యాటర్లు అద్భుతంగా ఆడటంతో పాక్ డైరక్టర్ మిక్కీ అర్ధర్ తట్టుకోలేకపోయారు.
Details
డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయిన ఆర్థర్
బౌలింగ్‌లో విఫలం కావడంతో పాటు ఫీల్డింగ్ వైఫల్యాలు ఆర్ధర్‌కు చిరాకు పుట్టించాయి.
దీంతో పాక్ ప్లేయర్లను తిట్టలేక తనలో తానే మదనపడిపోయాడు.
ఇక మ్యాచ్ సమయంలో విసుగ్గా కనిపించిన ఆర్ధర్, డైరక్టుగా డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిపోయాడు.
ఇక పాక్ తదుపరి మ్యాచుల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా లాంటి బలమైన ప్రత్యర్థులతో తలపడనుంది.