
Suryakumar Yadav: టీమిండియా జట్టులో గ్రూపులు లేవు.. జట్టుగానే కలిసి ఉన్నాం
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీలంక పర్యటనలో భారత జట్టు ఇప్పటికే టీ20 సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.
తాజాగా నేటి నుంచి టీమిండియా వన్డే సిరీస్‌ను ఆడనుంది.
ఈ క్రమంలో టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
గత టీ20 వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ప్లేయర్లు ఎప్పుడూ విడివిడిగా కూర్చోలేదని, టీమ్ గానే కూర్చుంటున్నామని పేర్కొన్నారు.
దీంతో జట్టులో మంచి వాతావరణం ఉందన్నారు. సూర్యకుమార్ యాదవ్ వ్యాఖ్యలపై మాజీ క్రికెటర్లు అజమ్ జడేజా, నెహ్రా భిన్నంగా స్పందించారు.
Details
జట్టులో క్రీడా స్ఫూర్తి అవసరం
క్రీడల్లో జట్టు స్ఫూర్తి అత్యంత అవసరమని, ఇప్పటికీ దీని గురించి ప్లేయర్లు మాట్లాడుకోవడం ఆశ్చర్యంగా ఉందని అజయ్ జడేజా అన్నారు.
సూర్య మాత్రం ఈ మర్పును ఇప్పుడే తీసుకొచ్చినట్లు చెబుతున్నాడని, ఇదంతా పాతదే అని జడేజా పేర్కొన్నాడు.
ఈ మార్పు ప్రపంచ కప్ సమయంలోనే జరిగిందా.. ఇలాంటి మార్పును ముందే ఎందుకు ప్రారంభించలేదని నెహ్రా వ్యాఖ్యనించాడు.
ఈ వ్యాఖ్యలపై తాను సూర్యను అనుమానించడం లేదు అన్నారు.