Team India: వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే.. ధోనిని వెనక్కి నెట్టిన రోహిత్
సొంతగడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచ కప్‌లో భారత జట్టు అదరగొడుతోంది. లీగ్ దశలో ఆడిన 9 మ్యాచుల్లోనూ గెలిచి ఆజేయంగా సెమీస్‌కు చేరింది. నిన్న జరిగిన మ్యాచుల్లో రోహిత్ శర్మ 55వ హాఫ్ సెంచరీని నమోదు చేశాడు. ఈ క్రమంలో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో ధోనిని రోహిత్ శర్మ అధిగమించాడు. అయితే ఇప్పటివరకూ భారత్ తరుఫున వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. రోహిత్ శర్మ వన్డేల్లో ఇప్పటివరకూ 10,615 పరుగులు చేశాడు. ఈ క్రమంలో భారతదేశం తరఫున అత్యధిక పరుగులు చేసిన ఐదవ ఆటగాడిగా హిట్ మ్యాన్ నిలిచాడు.
నాలుగో స్థానంలో రాహుల్ ద్రావిడ్
ప్రస్తుతం, వన్డే క్రికెట్‌లో పరుగుల పరంగా భారత బ్యాటర్లలో సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్ తర్వాతి స్థానాల్లో హిట్ మ్యాన్ నిలిచాడు. సెప్టెంబరులో రోహిత్ వన్డేల్లో 10,000 పరుగుల మార్క్‌ను అధిగమించిన విషయం తెలిసిందే. ప్రస్తుత భారత కోచ్ రాహుల్ ద్రవిడ్ భారత్ తరఫున నాలుగో స్థానంలో ఉన్నాడు. ఇప్పటివరకూ 340 వన్డేల్లో 39.15 సగటుతో 10,768 పరుగులు చేశాడు. ఇందులో 82 హాఫ్ సెంచరీలు, 12 సెంచరీలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో 860 పరుగులు నమోదు చేశాడు.
సచిన్ టెండూల్కర్ రికార్డుకు చేరువలో కోహ్లీ
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా నిలిచాడు. 308 వన్డేల్లో 40.95 సగటుతో 11,221 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 77 హాఫ్ సెంచరీలు చేశాడు. 21 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో 55.88 సగటుతో 1,006 పరుగులు చేశాడు కోహ్లి వన్డే క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం 290 మ్యాచ్‌ల్లో 58.44 సగటుతో 13,677 పరుగులు చేశాడు. ఇందులో 71 హాఫ్ సెంచరీలు, 49 వన్డే సెంచరీలు చేశాడు. భారత కెప్టెన్‌గా కోహ్లీ 95 వన్డేల్లో 72.65 సగటుతో కోహ్లీ 5,449 పరుగులు చేశాడు.
అగ్రస్థానంలో సచిన్ టెండూల్కర్
భారత దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అతను 463 మ్యాచ్‌ల్లో 44.83 సగటుతో 18,426 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 49 సెంచరీలు, 96 అర్ధసెంచరీలు చేశాడు. వన్డే ప్రపంచకప్‌లో 45 మ్యాచ్‌లలో 56.95 సగటుతో 2,278 పరుగులు చేశాడు.