Page Loader
అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే.. 
అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే..

అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే.. 

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2024
04:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంకతో జరిగిన తొలి వన్డేలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 47 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 3 సిక్సర్లు బాది ఓ అరుదైన రికార్డును సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్‌గా హిట్ మ్యాన్ రికార్డుకెక్కాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన కెప్టెన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Details

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఇప్పటివరకు 234 అంతర్జాతీయ సిక్సర్లు బాదాడు. అతను 2007 సంవత్సరంలో తన మొదటి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. ఇప్పటివరకు 481 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 43.29 సగటుతో 19,135 పరుగులు చేశాడు. ఇందులో 48 సెంచరీలతో పాటు 105 హాఫ్ సెంచరీలు చేశాడు. అతను అత్యధికంగా 264 పరుగులు బాదాడు. రోహిత్ మొత్తంగా 615 అంతర్జాతీయ సిక్సర్లు కొట్టాడు.

Details

రెండో స్థానంలో ఇయాన్ మోర్గాన్

సిక్సర్ల విషయంలో ఇంగ్లండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ రెండో స్థానంలో ఉన్నాడు . అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 233 సిక్సర్లు కొట్టాడు. మోర్గాన్ 379 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 35.60 సగటుతో 10,859 పరుగులు చేశారు. ఇందులో 16 సెంచరీలు, 64 హాఫ్ సెంచరీలున్నాయి.

Details

కెప్టెన్ గా 211 సిక్సర్లు బాదిన ధోని

భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని సిక్సర్ల విషయంలో మూడో స్థానంలో ఉన్నాడు. కెప్టెన్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 211 సిక్సర్లు కొట్టాడు. ధోని 538 మ్యాచ్‌లు ఆడి 44.96 సగటుతో 17,266 పరుగులు చేశాడు. ఇందులో 16 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలున్నాయి.

Details

171 సిక్సర్లతో రికి పాంటింగ్ నాలుగో స్థానం

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్‌గా 171 సిక్సర్లు కొట్టాడు. ఈ విషయంలో అతను నాలుగో స్థానంలో ఉన్నాడు. 560 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి, 45.95 సగటుతో 27,483 పరుగులు చేశాడు. ఇందులో 71 సెంచరీలు 146 అర్ధ సెంచరీలు సాధించాడు. అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌లో మొత్తంగా 246 సిక్సర్లు కొట్టాడు.