ఆసియా కప్‌లో అరుదైన రికార్డులను నెలకొల్పిన ప్లేయర్స్ వీరే!
ఈ వార్తాకథనం ఏంటి
మరో రెండు రోజులలో ఆసియా కప్ సమరం ప్రారంభం కానుంది. ఆగస్టు 30 నుంచి పాకిస్థాన్, శ్రీలంక వేదికగా ఆసియా కప్ మొదలు కానుంది.
ఈ టోర్నీలో ఇప్పటివరకూ అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు, ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఇప్పటివరకూ ఆసియా కప్ టోర్నీని 15 సార్లు నిర్వహించగా, అత్యధికంగా భారత్ ఏడుసార్లు విజేతగా అవతరించింది. ఈ ఆసియా కప్ ను 2016, 2022 సంవత్సరాల్లో టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా, మిగతా అన్ని సీజన్ లలో వన్డే ఫార్మాట్లో ఈ టోర్నీని నిర్వహించారు.
ఈ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన జాబితాలో శ్రీలంక మాజీ ప్లేయర్లు సనత్ జయసూర్య(1220), కుమార్ సంగార్కర (1075) నిలిచారు.
Details
అగ్రస్థానంలో ముత్తయ్య మరళీధరన్
ఇక సచిన్ టెండూల్కర్ కు ఆసియా కప్‌లో మెరుగైన రికార్డు ఉంది. 23 ఇన్నింగ్స్‌లో 971 పరుగులతో మూడో స్థానంలో నిలిచాడు.
పాకిస్థాన్ ప్లేయర్ షోయబ్ మాలిక్ 786 పరుగులతో నాలుగో స్థానంలో నిలిచారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 745 పరుగులతో ఐదో స్థానంలో ఉన్నాడు.
ఈ ఆసియా కప్‌లో హిట్ మ్యాన్ రాణిస్తే సచిన్ రికార్డును బద్దలు కొట్టే అవకాశముంది. ఈ టోర్నీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన టాప్ 5 ఆటగాళ్లలో నలుగురు శ్రీలంక స్పిన్నర్లే కావడం విశేషం.
ముత్తయ్య మరళీధరన్ 30 వికెట్లతో అగ్రస్థానంలో ఉండగా, లసిత్ మలింగ 29 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో నిలిచాడు.