IND Vs AUS : నేడు ఆస్ట్రేలియాతో మూడో టీ20.. గౌహతిలో సిరీస్‌ను భారత్ సాధిస్తుందా..?
ఆస్ట్రేలియాపై వరుసగా తొలి రెండు టీ20ల్లో గెలిచి జోరుమీదున్న యువ భారత జట్టు మూడో మ్యాచుకు సిద్ధమైంది. గౌహతి వేదికగా ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో నెగ్గి ఇక్కడే సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా(Team India) లక్ష్యంగా పెట్టుకుంది. తొలి రెండు మ్యాచుల్లో తేలిపోయిన ఆస్ట్రేలియా(Australia) ఈ మ్యాచులో నెగ్గి సిరీస్‌లో బోణి కొట్టాలని చూస్తోంది. ఈ మూడో టీ20ల్లో టీమిండియా ఒక మార్పుతో బరిలోకి దిగనుంది. ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ స్థానంలో మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ని తీసుకొనే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. అక్షర్ పటేల్ తొలి రెండు మ్యాచుల్లో కలిపి కేవలం ఒక వికెట్ మాత్రమే తీసుకున్నాడు.
ఆస్ట్రేలియా ఒక్క మార్పుతో బరిలోకి!
ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, మూడో స్థానంలో ఇషాన్ కిషాన్, నాలుగో స్థానంలో సూర్యకుమార్ యాదవ్, ఐదో స్థానంలో తిలక్ వర్మ, ఆరో స్థానంలో రింకు సింగ్ బరిలోకి దిగనున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్, ప్రసిద్ధ కృష్ణ ఉంటారు. ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగే అవకాశం ఉంది. సీన్ అబాట్ స్థానంలో బెరెన్ డార్ఫ్ తుది జట్టులోకి రావొచ్చు. ఈ మ్యాచుకు వర్షం ముప్పు లేకపోయినా మంచు ప్రభావం కచ్చితంగా ఉంటుంది.
ఇరు జట్లలోని సభ్యులు
భారత్ జట్టు రుతురాజ్ గైక్వాడ్, యశస్వి జైశ్వాల్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ముకేశ్ కుమార్, ప్రసిద్ధ్ కృష్ణ ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ షార్ట్, స్టీవ్ స్మిత్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, మాథ్యూ వేడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జేసన్ బెరెన్ డార్ఫ్/ తన్వీర్ సంఘా